గోల్డెన్​ టెంపుల్ లో అల్లు అర్జున్ సందడి

గోల్డెన్​ టెంపుల్ లో అల్లు అర్జున్ సందడి

పంజాబ్ : హీరో అల్లు అర్జున్ అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ లో ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి సందడి చేశారు. తన సతీమణి స్నేహారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రఖ్యాత గోల్డెన్ టెంపుల్​ను హీరో అల్లు అర్జున్ సందర్శించారు​. తన భార్య, పిల్లలతో కలిసి స్వర్ణ దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడే భార్య స్నేహారెడ్డి బర్త్ డే వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. తన పిల్లలు అల్లు అర్హ, అయాన్ సమక్షంలో స్నేహరెడ్డితో కేక్ కట్ చేయించారు. వీటికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే యంగ్ హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. సినిమా అప్ డేట్స్ తో పాటు ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటారు. ఇవాళ ఆయన సతీమణి స్నేహారెడ్డి బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో స్పెషల్ విషేస్ తెలిపారు. కేక్ కట్ చేస్తున్న ఫ్యామిలీ ఫొటోను పోస్ట్ చేశారు. 

ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప:ది రూల్’లో నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ‘పుష్ప : ది రైజ్’కు సీక్వెల్ గా వస్తోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు.