
ఆశిష్ హీరోగా శ్రీహర్ష కొనుగంటి డైరెక్ట్ చేసిన ‘రౌడీబాయ్స్’ చిత్రం ఇవాళ రిలీజవుతోంది. ఈ సందర్భంగా ఆశిష్‌తో పాటు నిర్మాత దిల్ రాజు కూడా కాసేపు ముచ్చటించారు. ఆశిష్ మాట్లాడుతూ ‘చిన్నప్పట్నుంచీ డ్యాన్స్ అంటే ఇష్టం. అల్లు అర్జున్‌ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నా. న్యూయార్క్, ముంబైలతో పాటు హైదరాబాద్‌లో కూడా యాక్టింగ్ కోర్సులు చేశా. ‘కేరింత’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశా. హీరోగా చేయగలనని అనడంతో.. శ్రీహర్షతో కథ చెప్పించారు. ఇంజినీరింగ్ వర్సెస్ మెడికల్ స్టూడెంట్స్ స్టోరీ అనగానే చాలా ఎక్సైటయ్యాను. నా ఏజ్‌కి తగ్గ క్యారెక్టర్ కాబట్టి ఈజీగా చేయగలిగాను. రొమాంటిక్ సీన్స్ మాత్రం కష్టంగా అనిపించేవి. ట్రైలర్ చూశాక కాంప్లిమెంట్స్ రావడం హ్యాపీ. సుకుమార్ శిష్యుడు కాశీతో ‘సెల్ఫిష్’ అనే సినిమా కూడా చేస్తున్నాను’ అని చెప్పాడు.
దిల్ రాజు మాట్లాడుతూ.. ‘ తన ఇంటరెస్ట్ చూసి సపోర్ట్ చేశాం. కానీ అది ఒకట్రెండు సినిమాల వరకే హెల్ప్ అవ్వుద్ది. ఆడియెన్స్‌కి రీచ్ కాకపోతే మనం ఎంత చేసినా ఉపయోగం ఉండదు. అందుకే హార్డ్ వర్క్ చేయాలని చెప్పాం. చాలా లావుండేవాడు. సన్నబడటానికి ఏం చేస్తావో చేయమంటే కష్టపడి స్లిమ్ అయ్యాడు. దీంతో పట్టుదలతో ఉన్నాడని అర్ధమైంది. పెర్ఫార్మెన్స్, డ్యాన్స్, ఎమోషన్స్, కామెడీ అన్నీ చేసేలా మౌల్డ్ చేశాం. పెద్ద దర్శకుడితో లాంచ్ చేయొచ్చు కానీ ఒక్కో మెట్టు ఎక్కితేనే బాగుంటుందనిపించింది. నేనూ అలాగే ఎదిగాను. తనకి ఒకటే చెప్పాను. ‘ఆశిష్ అనేది ఒక బ్రాండ్ కావాలి.. నీకంటూ ఏదైనా స్పెషాలిటీ ఉంటేనే ప్రేక్షకులు గుర్తిస్తారు’ అని. ఫైనల్‌గా మూవీ బాగా వచ్చింది. అందుకే రిజల్ట్ విషయంలో అందరం కాన్ఫిడెంట్‌గా ఉన్నాం’ అన్నారు.