IPO News: త్వరలో ఐపీఓకి హీరో ఫిన్‌‌కార్ప్‌‌ ఐపీవో.. టార్గెట్ రూ.3వేల 668 కోట్లు

IPO News: త్వరలో ఐపీఓకి  హీరో ఫిన్‌‌కార్ప్‌‌ ఐపీవో.. టార్గెట్ రూ.3వేల 668 కోట్లు

హీరో మోటోకార్ప్‌‌కు చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం హీరో ఫిన్‌‌కార్ప్ ఐపీఓకి రావడానికి రెడీ అయ్యింది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా  రూ.3,668 కోట్లను సేకరించేందుకు  మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నుంచి గ్రీన్ సిగ్నల్ పొందింది. డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ప్రకారం, ఈ ఐపీఓలో రూ.2,100 కోట్ల విలువైన ఫ్రెష్ ఈక్విటీ షేర్ల ఇష్యూ, ఇన్వెస్టర్ షేర్‌‌హోల్డర్ల నుంచి రూ.1,568 కోట్ల ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌‌ఎస్) కలిసి ఉంటాయి. 

ఓఎఫ్‌‌ఎస్‌‌లో ఏహెచ్‌‌వీఎఫ్‌‌ 2 హోల్డింగ్స్ సింగపూర్ 2 పీటీఈ, ఏపిస్‌‌ గ్రోత్ 2 (హిబిస్కస్) పీటీఈ, లింక్ ఇన్వెస్ట్‌‌మెంట్ ట్రస్ట్ (వికాస్ శ్రీవాస్తవ ద్వారా), ఒట్టర్  ఓఎఫ్‌‌ఎస్ కింద షేర్లు అమ్ముతున్నాయి.  కిందటేడాది ఆగస్టులో సెబీ వద్ద  ఐపీఓ పేపర్స్‌‌ను హీరో ఫిన్‌‌కార్ప్ ఫైల్ చేసింది. ఈ ఏడాది మే 22న అనుమతులు పొందింది.