The Raja Saab: రాజా సాబ్ థియేటర్లలో అనుకోని సర్‌ప్రైజ్.. కొత్త మూవీ టీజర్‌తో ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!

The Raja Saab: రాజా సాబ్ థియేటర్లలో అనుకోని సర్‌ప్రైజ్.. కొత్త మూవీ టీజర్‌తో ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!

జీనియస్ మూవీ ఫేమ్ హవీష్ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నేను రెడీ’. కావ్య థాపర్ హీరోయిన్. నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. గురువారం ఈ మూవీ టీజర్ అప్‌‌‌‌డేట్‌‌‌‌ను అందించారు మేకర్స్. జనవరి 9న విడుదలైన ‘రాజా సాబ్’ ప్రదర్శిస్తున్న అన్ని థియేటర్లలో ఈ టీజర్‌‌‌‌ను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారిక ప్రకటించారు.

సంక్రాంతి బరిలో ఉన్న ఈ పెద్ద సినిమాతో పాటు టీజర్ విడుదల కావడం వల్ల మ్యాసీవ్ రీచ్ లభించనుందని టీమ్ తెలియజేసింది. డిజిటల్ ప్లాట్‌‌‌‌ఫామ్స్‌‌‌‌లో కూడా త్వరలోనే రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు. ఇప్పటికే షూటింగ్ పూర్తికాగా, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌‌‌‌ జరుగుతున్నాయి.

బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, విటివి గణేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. నిజార్ షఫీ సినిమాటోగ్రాఫర్. ప్రవీణ్ పూడి ఎడిటర్. విక్రాంత్ శ్రీనివాస్ కథ, స్క్రీన్‌‌‌‌ప్లేను  అందించారు.