
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ దేవర (Devara). టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Shiva) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ క్రియేషన్స్ బ్యానర్స్ పై హీరో కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాను భారీగా నిర్మిస్తున్నారు.
లేటెస్ట్గా కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ (Devil) మూవీ..ఈ నెల 29న రిలీజ్ అవుతుండటంతో..ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.అందులో భాగంగా కళ్యాణ్ రామ్ దేవర సినిమా అప్డేట్స్ తెలిపారు.ఈ సినిమా రిలీజ్ డేట్లో ఎటువంటి మార్పు లేదని..తెలుగు సినిమా చరిత్రలోనే ఎన్నడూ చూడని విజువల్ ట్రీట్ దేవరలో ఉండనుందని..అందుకు తారక్ పడిన తపన చాలా గొప్పదని తెలిపారు కళ్యాణ్ రామ్.
అంతేకాకుండా..ప్రస్తుతం తెరకెక్కించే ఫైట్ సీన్స్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్గా ఉంటాయని..అందులో భాగంగా ఓ సీన్ కోసం భారీ సంప్ తవ్వాల్సి వచ్చిందని తెలిపారు. షూటింగ్ అంతా పక్కా ప్లానింగ్లో నడుస్తోందని..త్వరలో దేవర నుంచి మరిన్ని అప్డేట్స్ రాబోతున్నాయి అంటూ వివరించారు. ఇప్పటికే ఈ సినిమా 80 % షూటింగ్ కంప్లీట్ చేసుకుందని వెల్లడించారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#Devara is a visual spectacular, visuals, you will see never ever before seen visuals - Kalyan Ram ???@tarak9999 pic.twitter.com/CgHYlDUxDh
— Filmy Tollywood (@FilmyTwood) December 26, 2023
డెవిల్ సినిమా విషయానికి వస్తే..
స్పై థ్రిల్లర్ ‘డెవిల్’ సినిమా నుంచి రిలీజైన పాటలు, టీజర్, ట్రైలర్‌లకు ఆడియన్స్ నుంచి అద్భుత స్పందన వస్తోంది. ఈ మూవీలో బ్రిటీష్ కాలంలో గూఢచారి ఎలా ఉండేవారనే విషయాన్ని డెవిల్ మూవీలో ఆవిష్కరిస్తుండటం విశేషం. ఈ మూవీ డిసెంబర్ 29న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా మాటలు, స్క్రీన్ ప్లే, స్టోరీ అందించారు.