Bhaje Vaayu Vegam OTT: కార్తికేయ కొత్త సినిమా భజే వాయు వేగం OTT డేట్ ఫిక్స్

Bhaje Vaayu Vegam OTT: కార్తికేయ కొత్త సినిమా భజే వాయు వేగం OTT డేట్ ఫిక్స్

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గుమ్మికొండ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ భజే వాయు వేగం. క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను కొత్త దర్శకుడు ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించాడు. యువీ క్రియేషన్స్ బ్యానర్ లో వచ్చిన ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించారు. టీజర్, ట్రైలర్ తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ఆడియాన్స్ నుండి కూడా ఈ సినిమాకు పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే.. కలెక్షన్స్ మాత్రం అంతంత మాత్రం గానే సాధించింది. దాంతో.. చాలా కాలంగా హిట్ కోసం చూస్తున్న హీరో కార్తికేయకి  నిరాశే ఎదురయ్యింది. అందుకే.. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. తాజాగా ఇదే విషయంపై అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న  నెట్ఫ్లిక్స్ జూన్ 28 నుండి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో ఆడియన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. 

ఇక భజే వాయు వేగం సినిమా విషయానికి వస్తే.. హీరో తండ్రికి ఆరోగ్యసమస్యలు వస్తాయి. వైధ్యానికి చాలా డబ్బు అవసరం అవుతుంది. దాంతో ఇద్దరు అన్నదమ్ములు బెట్టింగ్ లో సంపాధిస్తారు. ఆ డబ్బును తీసుకోనివ్వకుండా విలన్ అడ్డుపడతాడు. మరి ఆ డబ్బును హీరో ఎలా సాధించాడు?హీరోలో విలన్ కి ఉన్న లింక్ ఏంటి? అనేది మిగిలిన కథ.