ఆఫర్స్ వస్తున్నాయి కానీ..

ఆఫర్స్ వస్తున్నాయి కానీ..

హీరోగా నటిస్తూనే అప్పుడప్పుడు నెగిటివ్ రోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనూ మెప్పిస్తున్నాడు కార్తికేయ. ‘వలీమై’ చిత్రంతో తమిళ ప్రేక్షకులకు కూడా తన విలనీని రుచి చూపించబోతున్నాడు. హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.వినోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దర్శకత్వంలో బోనీ కపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 24న రిలీజవుతున్న సందర్భంగా కార్తికేయ చెప్పిన కబుర్లు.

రెండేళ్ల క్రితం వినోద్ ఈ సినిమాలో నటించమని అడిగారు. హీరో ఇమేజ్ ఉండి, ఫిజికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గానూ స్ట్రాంగ్​గా ఉండే  విలన్ కోసం చూస్తున్నామన్నారు. ‘ఆర్ఎక్స్100’తో పాటు నేను నెగిటివ్ రోల్ చేసిన ‘గ్యాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లీడర్’ కూడా చూశానన్నారు. అజిత్ సినిమా కావడంతో వెంటనే ఓకే చెప్పాను. ‘గ్యాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లీడర్’లో కంటే ఎక్కువ స్కోప్ ఉన్న పాత్ర ఇది. చాలా లేయర్స్ ఉంటాయి. పర్ఫార్మెన్స్ పరంగానూ డెప్త్ ఉంది. నిజానికి నాకు బైక్ రేసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొత్త. రెండు రోజులు ప్రాక్టీస్ చేశాను. అజిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బైక్ నడపడం చాలెంజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అనిపించింది. ఆయన కూడా నా స్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని మ్యాచ్ చేసుకుని చేశారు. ఎనభై శాతం సీన్స్ నేనే చేశాను. కొన్ని కష్టమైనవి మాత్రం డూప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో చేయించారు. అజిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రం రిస్కీ సీన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సహా అన్నీ ఆయనే చేశారు. బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని గాల్లో తిప్పడం మామూలు విషయం  కాదు. 

అజిత్ గారి దగ్గర చాలా నేర్చుకున్నాను.  సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన కామన్ మేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లా ఉంటారు.  ఒకసారి షూటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయనకు పెద్ద దెబ్బ తగిలింది. అయినా ఎవరికీ చెప్పకుండా బైక్ సీన్స్ చేశారు. తర్వాత అడిగితే.. మళ్లీ అందరి డేట్స్ కుదరడం కష్టమవుతుందని, ఇంతమంది ఎఫర్ట్స్ తన వల్ల పాడవడం తనకు ఇష్టం లేదని అన్నారు. ఒక స్టార్ అలా బిహేవ్ చేయడం చాలా గ్రేట్.  వలీమై అంటే బలానికి, మనోబలానికి మధ్య ఉండే స్థితి.  అందుకే తెలుగులో బలం, పవర్ అనే టైటిల్స్ పెడదామనుకున్నారు కానీ.. డబ్బింగ్ సినిమా అనే ఫీలింగ్ వస్తుందనిపించింది. పైగా  వలీమై అనేది జనాల్లోకి బాగా వెళ్లిపోవడంతో తెలుగులోనూ దాన్నే ఫైనల్ చేశారు. ఈ సినిమాకి కమిటయ్యేప్పటికి తమిళం కొంచెం కూడా రాదు. కనీసం అర్థమైనా చేసుకోవాలని  తమిళ సినిమాలు చూశాను. చెన్నై  ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా కాస్త నేర్చుకున్నాను. తెలుగు ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి కూడా కనెక్టయ్యే మూవీ. నా క్యారెక్టర్ యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి రిప్రజెంటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లా ఉంటుంది. 

నా కెరీర్​లో తొలి ప్యాన్ ఇండియా సినిమా ఇది. దీని ద్వారా ఇతర భాషల్లోనూ నాకు గుర్తింపు వస్తుందనుకుంటున్నా. ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నేనేదైనా ప్యాన్ ఇండియా ఫిల్మ్స్ చేసినా ఇది హెల్పయ్యే చాన్స్ ఉంది. తమిళంలో మరిన్ని ఆఫర్స్ వస్తున్నాయి కానీ ప్రస్తుతానికి చేయదల్చుకోలేదు. తెలుగులో బిజీగా ఉన్నాను కాబట్టి అక్కడ తర్వాత ప్లాన్ చేసుకుంటాను. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రశాంత్ అనే కొత్త డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఓ మూవీ కంప్లీట్ చేశాను. శ్రీదేవి మూవీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒకటి, లౌక్య ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓ సినిమా చేయాల్సి ఉంది. అజయ్ భూపతితో ఓ బైలింగ్వల్ ప్లాన్ చేస్తున్నాం. ‘ఆర్ఎక్స్100 ’ సీక్వెల్ అనుకున్నాం కానీ.. మళ్లీ దాన్ని టచ్ చేస్తే బాగోదనిపించింది. ఇది వేరే సబ్జెక్ట్. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్. హీరో అయినా, విలన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయినా కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ముందుకు తీసుకెళ్లే పాత్రలే చేస్తాను.  రిజల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సంబంధం లేకుండా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. హిట్టయినా ఫ్లాపయినా యాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నా వర్క్ నేను చేసుకుంటూ వెళ్తున్నాను. నేనేమీ ఒక్క రోజులోనే చిరంజీవి గారిలా స్టార్ అయిపోవాలను కోవట్లేదు. ఫ్లాప్ సినిమాల ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాను. చేసిన తప్పుల్ని మళ్లీ రిపీట్ కాకుండా చూసుకుంటాను.