Kiran Abbavaram,Rahasya Gorak: తొలి సినిమా హీరోయిన్తోనే పెళ్లి.. షాకిచ్చిన కిరణ్ అబ్బవరం

Kiran Abbavaram,Rahasya Gorak: తొలి సినిమా హీరోయిన్తోనే పెళ్లి.. షాకిచ్చిన కిరణ్ అబ్బవరం

టాలీవుడ్ స్టార్స్ పెళ్లి బాట పడుతున్నారు. ఇటీవలే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో యంగ్ హీరో పెళ్ళికి రెడీ అయిపోయాడు. రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) త్వరలో పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు కాబోతున్నాడు. వధువు మరెవరో కాదు తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్(Rahasya Gorak). 

అవును.. గత ఐదేళ్లుగా ఈ జంట ప్రేమలో ఉన్నారట. ఈ నెల 13(మార్చ్ 13)న ఇరు కుటుంబాల సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ జరగనుందని సమాచారం. అనంతరం అతి త్వరలోనే వీరి పెళ్లి జరుగనుందట. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక కిరణ్ అబ్బవరం ఇచ్చిన షాక్ తో నెటిజన్స్ షాకవుతున్నారు. అంతేకాదు కాబోయే కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇదిలా ఉంటే.. రాజావారు రాణిగారు సినిమా తర్వాత రహస్య గోరఖ్ సినిమాల్లో నటించలేదు. చాలా ఏళ్ళ నుండి సినిమాలకు దూరంగానే ఉంటున్నారు ఆమె. ఇక కిరణ్ అబ్బవరం మాత్రం హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధంలేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఎస్ ఆర్ కల్యాణమండపం సినిమాతో కెరీర్ లో మొదటి బ్రేక అందుకున్న ఈ హీరో.. చాలా కాలం తరువాత వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో హిట్ బాట పట్టాడు. ఇటీవల రూల్స్ రంజన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్ అబ్బవరం ఆ సినిమాతో మరో ప్లాప్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు సినిమాల నుండి కాస్త బ్రేక్ తీసుకొని పెళ్ళికి రెడీ అయ్యాడు.