మా అధ్యక్ష బరిలోకి మంచు విష్ణు

V6 Velugu Posted on Jun 21, 2021

తెలుగు సినీ పరిశ్రమలో హడావుడి మొదలైంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ప్రకాశ్ రాజ్ మా అధ్యక్ష పదవికి పోటీపడనున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో ఆసక్తికర వార్త వినిపిస్తోంది. అధ్యక్ష బరిలోకి హీరో మంచు విష్ణు కూడా దిగనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడనుందని చెబుతున్నారు. కొత్త తరం కొత్త ఆలోచనలతో ముందుకు సాగితే మేలు జరుగుతుందనే అభిప్రాయంతో విష్ణు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పక్కా ప్లాన్ తోనే విష్ణు అడుగులు వేస్తున్నాడట.

తండ్రి, మోహన్ బాబు ఆశీస్సులతో పాటు.. సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు వంటి ప్రముఖ నటులను, నటీమణులను కూడా విష్ణు సంప్రదించి ఈ ఎన్నికల్లో పోటీలో నిలబడటానికి రెడీ అయ్యాడు.  'మా' సభ్యుల సంక్షేమం, 'మా' సొంత భవనం ఏర్పాటుకు కృషి... ఇవి  ప్రధాన ఎజెండాగా ముందుకు సాగాలని మంచు విష్ణు నిర్ణయించుకున్నారట. ఈసారి 'మా' అధ్యక్ష పోటీలో యంగ్ హీరో మంచు విష్ణు బరిలోకి దిగనుండటం ఎన్నికలపై ఆసక్తిని రేపుతోంది.

Tagged election, Manchu Vishnu, Maa association,

Latest Videos

Subscribe Now

More News