నాని హీరోగా వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సరిపోదా శనివారం’. డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ఆగస్టు 29న సినిమా విడుదల కానుంది. మంగళవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ఓ థియేటర్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో నాని మాట్లాడుతూ ‘ఈ సినిమాతో నెలాఖరు అదిరిపోతుంది. అందరితో కలిసి ఇక్కడే సినిమా చూస్తా. ప్రేక్షకుల ప్రేమకు థ్యాంక్స్.
ఈ ప్రేమను ఇలాగే కొనసాగిస్తుంటే వందశాతం కష్టపడి మీకు మంచి మంచి సినిమాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను’ అని చెప్పాడు. ‘శనివారం ‘బాషా’ లాంటి పాత్ర నాని పోషించారు. చాలా మంచి కంటెంట్, ఎనర్జీ ఉన్న సినిమా ఇది. తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది’ అని నటుడు ఎస్‌జె సూర్య చెప్పాడు. ‘గ్యాంగ్ లీడర్’ తర్వాత నానితో మళ్లీ కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని హీరోయిన్ ప్రియాంక మోహన్ చెప్పింది. మైండ్ బ్లోయింగ్ సినిమా అవుతుందని నిర్మాత దానయ్య చెప్పారు. నిర్మాతలు కళ్యాణ్ దాసరి, హన్షిత, హర్షిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.