హాయ్ నాన్న .. ఓడియమ్మ హీటు.. ఈడీయమ్‌‌లో బీటు

హాయ్ నాన్న ..  ఓడియమ్మ హీటు.. ఈడీయమ్‌‌లో బీటు

నాని, మృణాల్ ఠాకూర్ జంటగా శౌర్యువ్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్ ‘హాయ్ నాన్న’.   ఇప్పటికే విడుదలైన మూడు పాటలకు మంచి రెస్పాన్స్ రాగా, నాలుగో పాటను మంగళవారం ఓ కాలేజ్‌‌లో లాంచ్ చేశారు. పెప్పీ పార్టీ సాంగ్‌‌ స్టైల్‌‌లో సంగీత దర్శకుడు హేషామ్ అబ్దుల్ వహాబ్ దీన్ని కంపోజ్ చేశాడు. ధృవ్ విక్రమ్, చిన్మయి శ్రీపాదతో కలిసి హీరోయిన్ శ్రుతిహాసన్ పాడింది. ‘ఓడియమ్మ హీటు.. ఈడీయమ్‌‌లో బీటు, రేడియంలా లైటు, బాడీలో ఇటు అటు’ అంటూ అనంత శ్రీరామ్ లిరిక్స్ రాశారు. 

కలర్‌‌ఫుల్ సెట్స్‌‌లో, పార్టీ బ్యాక్‌‌డ్రాప్‌‌లో చిత్రీకరించిన ఈ పాటలో నాని, శ్రుతిహాసన్ గ్రేస్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్‌‌తో ఆకట్టుకున్నారు. ఇక సాంగ్ లాంచ్ సందర్భంగా నాని మాట్లాడుతూ ‘ఇకపై ఎక్కడికి వెళ్ళినా, పార్టీ ఎక్కడ జరిగినా ఈ పాటే మోగుతుంది. డిసెంబర్ 7న సినిమా విడుదలవుతోంది. అందరూ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి’ అన్నాడు. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకుడు శౌర్యువ్, నిర్మాతలు మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి పాల్గొన్నారు.