త్వరలో కార్తికేయ3

త్వరలో కార్తికేయ3

‘కార్తికేయ 2’ చిత్రంతో తెలుగుతో పాటు హిందీలోనూ బ్లాక్ బస్టర్‌‌‌‌ హిట్‌‌ను అందుకున్న నిఖిల్.. ప్రస్తుతం ‘స్వయంభూ’ అనే ప్రెస్టీజియస్ మూవీలో నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇదిలా ఉంటే తన కొత్త సినిమాకు సంబంధించిన అప్‌‌డేట్ ఇచ్చాడు నిఖిల్. కార్తికేయ, కార్తికేయ 2 చిత్రాలతో కెరీర్‌‌‌‌ బెస్ట్‌‌ హిట్స్ అందుకున్న నిఖిల్.. త్వరలో ‘కార్తికేయ 3’లో నటించబోతున్నాడు.

‘డా. కార్తికేయ సరికొత్త  సాహసం... త్వరలో’ అంటూ సోషల్ మీడియా ద్వారా ఈ సీక్వెల్‌‌పై అఫీషియల్‌‌ అనౌన్స్‌‌మెంట్ ఇచ్చాడు నిఖిల్. ఈ అడ్వెంచరస్‌‌ థ్రిల్లర్‌‌‌‌కు సంబంధించి దర్శకుడు చందూ మొండేటి ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడట. గత రెండు చిత్రాలకు మించిన స్పాన్‌‌లో ఈ సినిమా ఉండబోతోంది అంటున్నారు. ఇతర వివరాలను త్వరలో రివీల్ చేయనున్నారు.