రివ్యూ: చెక్

రివ్యూ: చెక్

రన్ టైమ్: 2 గంటల 25 నిమిషాలు

నటీనటులు: నితిన్,రకుల్ ,ప్రియా ప్రకాష్ వారియర్,సాయి చంద్,మురళీ శర్మ,సంపత్ రాజ్ తదితరులు

సినిమాటోగ్రఫీ:రాహుల్ శ్రీ వాత్సవ్

మ్యూజిక్: కళ్యాణి మాలిక్

నిర్మాత: వి.ఆనంద్ ప్రసాద్

రచన,దర్శకత్వం: చంద్రశేఖర్ ఏలేటి

రిలీజ్ డేట్: ఫిబ్రవరి 26

 

కథేంటి?

ఈజీ మనీ కోసం చిన్న చిన్న సైబర్ నేరాలు చేసే ఆదిత్య (నితిన్) యాత్ర (ప్రియా ప్రకాష్) ప్రేమలో పడతాడు.ఆమె అతన్ని మోసం చేసి ఓ టెర్రరిజం కేసులో ఇరికిస్తుంది. జైలు పాలైన ఆదిత్య (నితిన్) అక్కడ లైఫ్ అంటే ఏంటో నేర్చుకుంటాడు. శ్రీమన్నారయణ (సాయిచంద్) ద్వారా చెస్ గేమ్ నేర్చుకొని తన నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకున్నాడు? చివరికి యాత్ర దొరికిందా? తన లాయర్ అయిన మానస (రకుల్) ఆదిత్యకు ఏ విధంగా హెల్ప్ చేసిందనేది స్టోరీ.

నటీనటుల పర్ఫార్మెన్స్:

నితిన్ తనవరకు బాగా చేశాడు. ఆదిత్య పాత్రకు న్యాయం చేశాడు. ప్రియా ప్రకాష్ వారియర్ కు ఇంకా నటించడం రావటం లేదు. రకుల్ కు మంచి పాత్ర దక్కింది,.తన పరిధిమేర నటించి మెప్పించింది. సాయి చంద్ మంచి నటన కనబరిచాడు. శ్రీమన్నారాయణ పాత్రలో ఒదిగిపోయి నటించాడు. మురళీ శర్మ ,సంపత్ రాజ్ అలవాటైన పాత్రలు చేసారు.

టెక్నికల్ వర్క్:

రాహుల్ శ్రీ వాత్సవ్ సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి. కళ్యాణి మాలిక్ పాటలు వినసొంపుగా లేవు.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటింగ్ లో లోపాలున్నాయి. డైలాగులు బాగా రాసుకున్నాడు. కానీ కొన్నిసార్లు సూక్తులు ఎక్కువైనట్టు అనిపించాయి. ప్రొడక్షన్ వాల్యూయ్స్ రిచ్ గా ఉన్నాయి.

విశ్లేషణ:

ప్రతీ సినిమాలో కొత్తదనం చూపించే చంద్రశేఖర్ ఏలేటి  ‘‘చెక్’’ మూవీలో కూడా కొత్త పాయింట్ ను ప్రెజెంట్ చేయాలనుకున్నాడు. హాలీవుడ్ మూవీ ‘‘షాశంక్ రీడింప్షన్’’ ఇన్సిపిరేషన్ గా తీసుకొని ఈ మూవీ చేశాడు. పాయింట్ వెరైటీగా నే ఉన్నా.. ఎక్సిక్యూషన్ మాత్రం బ్యాడ్ గా సాగింది. అనేక లాజిక్ లు మిస్ చేస్తూ చిందరవందరగా ఉంది స్క్రీన్ ప్లే. వినూత్న దర్శకుడైన యేలేటి నుండి ఇలాంటి సినిమా ఊహించలేం. ఫస్టాఫ్ ఫర్వాలేదనిపించినా.. సెకండాఫ్ మాత్రం మిస్ ఫైర్ అయింది. జైల్లో ఉన్న ఖైదీ చెస్ ఆడటం, పోలీస్ లను, ఖైదీలను ఇష్టం వచ్చినట్టు కొట్టడం, విలనీ ఖైదీలు ఇష్టం వచ్చినట్టు బీహేవ్ చేయడం ఏంటో అనిపిస్తుంది. కొన్నిసార్లు అది జైలేనా లేక ఏదైనా ఖైదీల అడ్డానా అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ మరీ ఊహకందకుండా సాగుతుంది. హీరో తప్పించుకోవటం కోసం ఓ సొరంగ మార్గం లో మూడు నెలలు దాక్కోవటం నమ్మేట్టుగా అనపించదు. ఇలా లాజిక్ లకు అందని సీన్లు కోకొల్లలు. ఓవరాల్ గా ‘‘చెక్’’ పూర్తిగా నిరాశపరుస్తుంది.

బాటమ్ లైన్: ప్రేక్షకులకు ‘‘చెక్’’ పెట్టింది.