టాలీవుడ్ యువ నటుడు నితిన్ తండ్రి అయ్యారు. హీరో నితిన్ భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. జయం, సై, ఇష్క్, గుండెజారి గల్లంతయిందే, అ ఆ వంటి సినిమాల్లో హీరోగా నటించిన తెలుగు నటుడు నితిన్.
నిర్మాతగా మారిన నితిన్ కొన్ని సినిమాలను నిర్మించారు కూడా. 2020లో షాలిని కందుకూరితో ఇతనికి వివాహం జరిగింది. సుమారు నాలుగు సంవత్సరాల తర్వాత శుక్రవారం (సెప్టెంబర్ 6) నితిన్ భార్య షాలిని మగ బిడ్డకు జన్మనిచ్చారు.
Welcoming the NEWEST STAR 🌟 of our family!! ❤️ pic.twitter.com/otBHvwSnNo
— nithiin (@actor_nithiin) September 6, 2024
ఈ విషయాన్ని నితిన్ అభిమానులతో శుభవార్తను షేర్ చేసుకునేందుకు సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం X ద్వారా షేర్ చేశారు. చేసుకుంటూ తల్లి బిడ్డ ఇద్దరు క్షేమమే అని తెలిపారు.