ప్రభాస్ ఇన్‌స్టాపై వీడిన మిస్టరీ.. అసలు ఏమైందంటే ?

ప్రభాస్ ఇన్‌స్టాపై వీడిన మిస్టరీ.. అసలు ఏమైందంటే ?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ప్లాట్‌ఫారమ్ నుంచి సడెన్ గా అదృశ్యమైన విషయం తెలిసిందే. దీనిపై కొందరు అకౌంట్ హ్యాక్ అయి ఉండొచ్చని, మరికొందరు ప్రభాస్ స్వయంగా డీయాక్టివేట్ చేసి ఉండొచ్చని భావించారు.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..ప్రభాస్ ఇన్‌స్టా మిస్టరీ వీడింది. అసలు విషయానికి వస్తే..టెక్నికల్ సమస్యల కారణంగా ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డౌన్ అయిందని, అయితే ప్రభాస్ ఇన్ స్టా ప్రస్తుతం రీయాక్టివేట్ అయింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. 

ప్రభాస్ సాధారణంగా సోషల్ మీడియాకు కాస్త దూరంగానే ఉంటారు. కేవలం ఫేస్ బుక్, ఇన్ స్టా మాత్రమే అప్పుడప్పుడు ఉపయోగిస్తుంటారు. ఈ రెండు ఖాతాల్లో కేవలం తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ మాత్రమే పంచుకుంటారు. ప్రభాస్ కు ఇన్ స్టాలో దాదాపు కోటి అంటే పది మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఉన్నట్లుండి ప్రభాస్ ఇన్ స్టా అకౌంట్ మిస్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా ప్రభాస్ ఫ్యాన్స్ లో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ప్రభాస్ యూరప్‌లో ఉన్నారు..మోకాలికి శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్నాడు. మరో 6 నుండి 7 వారాల పాటు మరో 15 రోజులు యూరప్‌లో విశ్రాంతి తీసుకుంటారని సమాచారం. 

ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న ఆయన లేటెస్ట్ మూవీ సాలార్ పార్ట్ 1 డిసెంబర్ 22, 2023న గ్రాండ్ గా రిలీజ్‌ కాబోతుంది. మేకర్స్ వచ్చే నెల నుంచి ఈ మూవీ ప్రమోషన్‌లను ప్రారంభించబోతున్నారు. ఇక మారుతీ దర్శకత్వంలో మరో సినిమా షూటింగ్‌లో కూడా ప్రభాస్ చురుగ్గా పాల్గొంటున్నాడు. దాంతో పాటు నాగ్ అశ్విన్ తో ‘కల్కి’లోనూ ప్రభాస్ నటిస్తున్నాడు.