కల్కికి ఎలక్షన్ ఎఫెక్ట్‌‌ !

కల్కికి  ఎలక్షన్ ఎఫెక్ట్‌‌ !

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఎడి’. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనె, దిశా పటాని లాంటి స్టార్స్ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అశ్వనీదత్ భారీ బడ్జెట్‌‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  సమ్మర్ స్పెషల్‌‌గా మే 9న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

కానీ ఆ డేట్‌‌ను వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్​లో జరగనున్న ఎలక్షన్సే దీనికి కారణమంటూ ప్రచారం జరుగుతోంది. ఏపీలో మే 13న ఎన్నికలు ఉండటంతో ప్రజలంతా ఎలక్షన్స్ హడావుడిలో ఉంటారు.  అందుకే తమ  చిత్రాన్ని పోస్ట్ పోన్ చేస్తే బెటర్ అని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట.  వాస్తవానికి మే 9  వైజయంతీ మూవీస్‌‌ బ్యానర్‌‌‌‌కు బాగా కలిసొచ్చిన తేదీ.

ఈ బ్యానర్‌‌‌‌లో రూపొందిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ అదే డేట్‌‌కు విడుదలై బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఆ సెంటిమెంట్‌‌తోనే మే 9న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా వాయిదా వేయడం తప్పదని తెలుస్తోంది.  దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇందులో  ప్రభాస్ లుక్, హాలీవుడ్ స్టైల్‌‌ విజువల్స్, యాక్షన్ సీన్స్‌‌తో ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై క్యూరియాసిటీని  పెంచాయి.