క్రేజీ లుక్లో రామ్.. బోయపాటి మాస్ ఫీస్ట్ లోడింగ్

క్రేజీ లుక్లో రామ్.. బోయపాటి మాస్ ఫీస్ట్ లోడింగ్

ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో, రామ్ చేస్తున్న మూవీ నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ థండర్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. ఇందులో భాగంగా కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ లో రామ్.. బేస్ బాల్ బాట్ పట్టుకొని నెవర్ బిఫోర్ మాస్ అండ్ స్టైలీష్ అవతార్ లో కనిపిస్తున్నాడు. ఈ పిక్ చూసాక ఇది పక్క బోయపాటి స్టైల్ ఊరమాస్ సినిమాగానే ఉండబోతుందని అర్థమవుతుంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ థండర్ ను మే 15న రామ్ పోతినేని బర్త్ డే కానుకగా రిలీజ్ చెయ్యడానికి రెడీ అయ్యారు మేకర్స్.

మరి పోస్టర్ తోనే దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన బోయపాటి అండ్ రామ్.. ఫర్ట్ థండర్ తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి. అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో.. లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.