వెల్కమ్ ఇసాయ్ పూయల్.. ఏఆర్ రహమాన్కు బర్త్డే విషెష్ చెప్పిన RC16 టీమ్

వెల్కమ్ ఇసాయ్ పూయల్.. ఏఆర్ రహమాన్కు బర్త్డే విషెష్ చెప్పిన RC16 టీమ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram charan), ఉప్పెన(Uppena) దర్శకుడు బుచ్చిబాబు సన(Buchhibabu sana)తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. చాలా రోజుల క్రితమే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలవలేదు. కానీ, ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రం ఫుల్ స్వింగ్ ల్లో జరుగుతున్నాయి. రూరల్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో రానున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం స్టార్ కాస్ట్ ను దింపుతున్నారు మేకర్స్. అందులో ఏఆర్ రహమాన్ ఒకరు. 

ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుండి ఏఆర్ రహమాన్ సంగీతం అందించనున్నారు అనే వార్త వైరల్ గా మారింది. తాజాగా ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చారు RC16 మేకర్స్. జనవరి 6 రహమాన్ పుట్టినరోజు సందర్బంగా RC16 టీమ్ అఫీషియల్ గా విషెష్ తెలిపారు. ఈ సందర్బంగా కొత్త పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు రామ్ చరణ్. దీంతో RC16 సినిమాకు రహమాన్ వర్క్ చేస్తున్నారు అనేదానిపై క్లారిటీ వచ్చేసింది. 

నిజానికి రహమాన్ ఈ సినిమా కి పనిచేయడం అనేది చాలా పెద్ద విషయం. ఆయన ఒక సినిమాను ఒకే చేయాలంటే ఖచ్చితంగా ఆ సినిమాలో ఎదో ఒక ప్రత్యేకత ఉంటేనే, ఆ కథ నచ్చితేనే చేస్తారు. అంతేకాదు గత కొన్నేళ్లుగా ఆయన తెలుగు సినిమాలకు మ్యూజిక్ ఇవ్వడం మానేశారు. ఆయన చివరగా మ్యూజిక్ అందించిన తెలుగు సినిమా అంటే పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన కొమురల్ పులి అనే చెప్పాలి. అలా చాలా కాలం తరువాత రహమాన్ ఒక తెలుగు సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.