
టాలీవుడ్ హీరో శర్వానంద్ త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నాడు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకడైన శర్వా.. ఓ ఎన్నారై అమ్మాయిని మ్యారేజ్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. శర్వా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోందట. కొన్ని నెలల క్రితం వరకు యూఎస్‌లో ఉన్న ఆ అమ్మాయి... వర్క్ ఫ్రం హోం కావడంతో స్వస్థలం హైదరాబాద్‌కు వచ్చేసిందని తెలుస్తోంది.
సదరు అమ్మాయితో శర్వానంద్ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ సమ్మర్ లో వీరి పెళ్లి జరగే ఛాన్సుందని వార్తలు వస్తున్నాయి. ఇరు కుటుంబాలు పెళ్లి తేదీ, ఇతర కార్యక్రమాలను ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నాయని చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సివుంది.
పెళ్లి రూమర్స్ పై శర్వానంద్ ఎలా స్పందిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. శర్వా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి దాదాపు 15 ఏళ్లైంది. అప్పటి నుంచి వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మనస్సులో మంచి స్థానం సంపాదించుకున్నాడు. గత ఏడాది ఒకే ఒక జీవితం మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన శర్వా ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.