కమర్షియల్‌‌ కంటెంట్‌‌తో టక్కర్‌‌‌‌ :  సిద్దార్థ్

కమర్షియల్‌‌ కంటెంట్‌‌తో టక్కర్‌‌‌‌ :  సిద్దార్థ్

సిద్ధార్థ్ హీరోగా కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘టక్కర్’. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నాయి. ఈనెల 9న సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. నిర్మాత సురేష్ బాబు, దర్శకులు బొమ్మరిల్లు భాస్కర్ , తరుణ్ భాస్కర్ , వెంకటేష్ అతిథులుగా హాజరై బెస్ట్ విషెస్ చెప్పారు. 

హీరో సిద్దార్థ్ మాట్లాడుతూ ‘న్యూ ఏజ్‌‌ లవ్‌‌స్టోరీతో కూడిన యాక్షన్‌‌ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌ ఇది. లవర్ బాయ్ రగ్గడ్‌‌గా ఉంటే ఎలా ఉంటుందో అలా నన్ను చూపించారు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా ఎప్పుడు చేస్తారని నన్ను అడుగుతుంటారు. దానికి సమాధానమే ఈ సినిమా’ అన్నాడు. ‘థియేటర్‌‌‌‌లో చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా’ అంది దివ్యాంశ. 

దర్శకుడు మాట్లాడుతూ ‘యూనివర్సల్ కంటెంట్‌‌తో చేశాం. ఈ కాలానికి ఇదొక ట్రెండ్ సెట్టర్ అవుతుంది. అంచనాలకు మించి ఉంటుంది. మా గురువు శంకర్ గారిని ఆదరించిన తెలుగు ప్రేక్షకులు.. ఆయన శిష్యుడినైన నా సినిమాను కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నా’ అన్నాడు. సినిమా మంచి హిట్ అవుతుందనే నమ్మకం ఉందని నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ అన్నారు.