Siddarth: నా సినిమా చూడలేరు కానీ.. యానిమల్ చూస్తారు.. హీరో సిద్దార్థ్ షాకింగ్ కామెంట్స్

Siddarth: నా సినిమా చూడలేరు కానీ.. యానిమల్ చూస్తారు.. హీరో సిద్దార్థ్ షాకింగ్ కామెంట్స్

హీరో సిద్దార్థ్(Siddarth) షాకింగ్ కామెంట్స్ చేశారు. కొంతమంది ఆడియన్స్ తన సినిమా ఇబ్బందికరంగా ఉందని అన్నారని, మళ్ళీ వాళ్ళే వెళ్లి యానిమల్ సినిమా చూశారని అన్నారు. ప్రస్తుతం సిద్దార్థ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఇటీవల హీరో సిద్దార్థ్ జేఎఫ్‍డబ్ల్యూ ఈవెంట్‍కు హాజరయ్యారు.

ఇందులో భాగంగా సిద్దార్థ్ మాట్లాడుతూ.. నేను చిన్నా(తమిళంలో చిత్తా) అనే సినిమా చేశాను. చిన్నారులపై వేధింపుల అంశంపై ఈ సినిమా వచ్చింది. చిన్నా సినిమా ఇబందికారంగా ఉందని ఒక్క మహిళ కూడా చెప్పలేదు. కానీ, కొంతమంది మగవాళ్ళు నాకు కాల్ చేసి.. సినిమా కాస్త ఇబ్బంది కరంగా ఉందని, చూడలేకపోయామని చెప్పారు. కానీ, అలా చెప్పునవారే యానిమల్ సినిమా చూశారు. కేవలం నా సినిమాలే వాళ్లకి ఇబ్బందికరంగా అనిపిస్తాయి. యానిమల్ లాంటి సినిమాలు అనిపించవు. ఇది అవమానం, సిగ్గుచేటు. అయినా పర్వాలేదు త్వరలోనే బాగుపడుతుంది.. అంటూ చెప్పుకొచ్చాడు సిద్ధార్థ్. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక సిద్దార్థ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్ 2 సినిమాలో కీలకపాత్రలో కనిపించనున్నాడు. లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా వస్తున్న ఈ సినిమా జూన్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేయగా.. రిలీజ్ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య థియేటర్స్ లోకి రానున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.