భాగ్‌‌ సాలేతో ఎంటర్‌‌‌‌టైన్ చేస్తా

భాగ్‌‌ సాలేతో ఎంటర్‌‌‌‌టైన్ చేస్తా

శ్రీసింహా కోడూరి, నేహా సోలంకి జంటగా ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భాగ్ సాలే’. అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మించారు. శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా హీరో శ్రీసింహా మాట్లాడుతూ ‘థియేటర్‌‌‌‌‌‌‌‌కు వచ్చే ప్రేక్షకులను ఫుల్‌‌‌‌గా నవ్వించాలని చేసిన సినిమా ఇది. దర్శకుడు నాకు ఈ కథ చెప్పి చాలా కాలమైంది. నాకున్న ఇతర కమిట్మెంట్స్‌‌‌‌ వల్ల ఆలస్యంగా చేయాల్సి వచ్చింది. ప్రణీత్‌‌‌‌ ఎప్పుడూ ప్రతీ సీన్, ప్రతీ కారెక్టర్‌‌‌‌లో బెటర్మెంట్ కోసం ట్రై చేస్తుంటాడు. 

షూటింగ్‌‌‌‌కు ముందు దీనికి పదిహేను వెర్షన్స్ రాశాడు. అదే తన బలం. నా గత చిత్రాల్లోనూ కామెడీ ఉన్నా, నా పాత్ర అలా ఉండదు. కానీ ఈసారి నా క్యారెక్టర్‌‌‌‌లోనే కామెడీ ఉంది. ఈ పాత్రతో ప్రేక్షకులను ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్ చేస్తాననే నమ్మకముంది. క్రైమ్ కామెడీ జానర్‌‌‌‌ అయినప్పటికీ అన్నిరకాల కమర్షియల్ అంశాలతో తీశాం. ఎక్కువ రీటేక్స్ అయినా, సహజంగా ఉండాలని రియల్ లొకేషన్స్‌‌‌‌లో జనాల మధ్య తీశాం. కాళ భైరవ అందించిన ఆర్ఆర్ వల్ల సినిమా మరో స్థాయికి వెళ్లింది. ఈ మూవీకి ఫస్ట్ సెలెక్ట్ అయింది కాళ భైరవ అన్ననే. ఇంత వరకు నా ఏ సినిమాకు రాని ఈ మూవీకి రావడం హ్యాపీ’ అని చెప్పాడు.