Om Bheem Bush OTT: OTTలో ఓం భీం బుష్ మూవీకి ఊరమాస్ రెస్పాన్స్.. తొలిరోజే ట్రేండింగ్లోకి

Om Bheem Bush OTT: OTTలో ఓం భీం బుష్ మూవీకి ఊరమాస్ రెస్పాన్స్.. తొలిరోజే ట్రేండింగ్లోకి

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు(SriVishnu), కమెడియన్స్ ప్రియదర్శి(Priyadarshi), రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna)  ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ ఓం భీం బుష్(Om Bheem Bush). హుషారు ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి(Sreeharsha konuganti) తెరకెక్కించిన ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. నో లాజిక్. ఓన్లీ మ్యాజిక్ అంటూ మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఓ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ చేసింది. ఫుల్ ఆన్ ఫన్ రైడ్ లా వచ్చిన ఈ సినిమా అదే రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టి మేకర్స్ కు మంచి లాభాలు తెచ్చిపెట్టడమే కాకుండా.. శ్రీవిష్ణు కెరీర్ లో మరి సూపర్ హిట్ గా నిలిచింది.

ఇదిలా ఉంటే.. ఓం భీం బుష్ సినిమా థియేటర్స్ లోకి వచ్చి 20 రోజులు కూడా గడవకుండానే ఓటీటీలో రిలీజ్ చేశారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఏప్రిల్ 12 నుండి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తోంది. అయితే ఓటీటీలో విడుదలైన మొదటిరోజే ఈ సినిమాకు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. నిజానికి ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. దాంతో.. ఓటీటీలో ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వచ్చింది. కేవలం ఒక్కరోజులోనే టాప్ రెండవ పొజిషన్ లో ట్రెండ్ అవుతోంది ఈ మూవీ. అలా థియేటర్స్ లో సూపర్ హిట్ గా నిలిచినా ఈ సినిమా ఓటీటీలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను సొతం చేసుకుంది. మరి వీలుంటే మీరు కూడా ఓటీటీలో ఈ సినిమాను చేసేయండి.