HBD SreeVishnu: కొంచం గ్యాప్ ఇవ్వు అన్నా: ఒకటి కాదు ఏకంగా మూడు

HBD SreeVishnu: కొంచం గ్యాప్ ఇవ్వు అన్నా: ఒకటి కాదు ఏకంగా మూడు

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు(Sree Vishnu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ తో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు.. ఆతరువాత హీరోగా మారి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన సినిమాలకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా మంది యూత్ శ్రీవిష్ణు సినిమాలంటే ఇష్టపడతారు. 

ఇటీవలే సామజవరగమన సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న శ్రీవిష్ణు త్వరలో ఓం భీం బుష్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ఫిబ్రవరి 29 శ్రీవిష్ణు పుట్టినరోజు. ఈ సందర్బంగా తన తరువాతి సినిమాల నుండి అదిరిపోయే అప్డేట్స్ ఇచ్చాడు శ్రీవిష్ణు. ముందుగా రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ఓం భీమ్ బుష్ నుండి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఫుల్ ఆన్ ఫన్ రైడ్ లా ఉన్న ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది. 

ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చేస్తున్న మరో సినిమా టైటిల్ అనౌన్స్ చేశాడు శ్రీవిష్ణు. ఇప్పటికే ఆయనకు రాజా రాజా చోర వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు హసిత్ గోలి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు స్వాగ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. శ్వాగానిక వంశానికి స్వాగతం అనేది ఉపశీర్షిక. చాలా వినూత్నంగా ఉన్న ఈ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా.. సినిమాపై అంచనాలు పెంచుతోంది. 

ఇక గీత ఆర్ట్స్ బ్యానర్ లో మరో సినిమా చేయనున్నాడు శ్రీవిష్ణు. ఈ ప్రాజెక్టుకు సంబందించిన అనౌన్స్మెంట్ తాజాగా విడుదల చేశాడు శ్రీవిష్ణు. శ్రీవిష్ణు కెరీర్ లో 18వ సినిమాగా వస్తున్న ఈ మూవీకి కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్. అలా పుట్టినరోజు సందర్బంగా ఒకటి కాదు మూడు సినిమాల అప్డేట్స్ ఇచ్చి తన ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు శ్రీవిష్ణు.