అభిమాని మృతి.. కన్నీళ్లు పెట్టుకున్న హీరో సూర్య

అభిమాని మృతి.. కన్నీళ్లు పెట్టుకున్న హీరో సూర్య

హీరో సూర్య కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాజాగా యూఏస్ టెక్సాస్ లో జరిగిన కాల్పుల్లో తెలుగమ్మాయి తాటికొండ ఐశ్వర్య మరణించిన విషయం తెలిసిందే. ఆమె తమిళ స్టార్ హీరో సూర్యకు చాలా పెద్ద అభిమాని. ఈ విషయం తెసులుకున్న సూర్య.. ఆమె మరణం పట్ల తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. 

ఐశ్వర్య చిత్ర పటానికి నివాళులు అర్పించి.. ఆమె కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేస్తూ లేక కూడా  రాసాడు. ఈ లేఖలో సూర్య.. "ఐశ్వర్య మృతి తీరని లోటు. మిమ్మల్ని ఎలా ఓదార్చాలో కూడా నాకు తెలియడం లేదు. మన జ్ఞాపకాల్లో ఎప్పుడూ సజీవంగానే ఉంటింది" అంటూ ఆమె తల్లిదండ్రులను ఓదార్చాడు సూర్య. ప్రస్తుతం సూర్య రాసిన ఈ లేక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.