
బాల నటుడిగా అనేక చిత్రాల్లో నటించిన తనీష్.. ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. గురువారం తనీష్ బర్త్‌డే సందర్భంగా తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. తనీష్ హీరోగా కిశోర్ వర్మ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘క్రిమినల్’. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో తనీష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు మేకర్స్.
ఈ పోస్టర్‌లో రెండు డిఫరెంట్ వేరియేషన్స్‌లో తనీష్ కనిపిస్తున్నాడు. క్రియేటివ్ ఫ్రెండ్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామని దర్శక నిర్మాతలు చెప్పారు.