నాది తన స్టైల్ కాదన్నారు

నాది తన స్టైల్ కాదన్నారు

ప్రేమకథా చిత్రాల్లో హీరోగా మెప్పించిన త్రిగుణ్.. మొదటిసారి పొలిటికల్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో నటించిన మూవీ ‘కొండా’. కొండా మురళి, సురేఖ దంపతుల జీవితం ఆధారంగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 23న రిలీజవుతోంది. ఈ సందర్భంగా త్రిగుణ్  ఇలా ముచ్చటించాడు.  

‘‘నా మొదటి సినిమా ‘కథ’ టైమ్ నుంచే వర్మతో సినిమా చేయాలని వెయిట్ చేస్తున్నాను. కానీ అప్పట్లో  రొమాంటిక్ హీరోలా ఉన్నానని, నాది తన స్టైల్ కాదని అన్నారు. దీంతో ఆశలు వదిలేసుకున్నా. మళ్లీ నాలుగేళ్ల తర్వాత ఆయనే ‘ఎలాంటి సినిమా చేయాలనుకుంటున్నావు’ అని అడిగారు. యాక్షన్ ఫిల్మ్ చేయాలనుంది అన్నాను. ఆర్కే, నయీమ్, గణపతి.. ఇలా తెలంగాణలో కొంతమందిపై రీసెర్చ్ చేశారు. వేరే పాత్ర కోసం లుక్ టెస్ట్ కూడా చేశాం. ఫైనల్‌‌‌‌గా కొండా మురళి స్ర్కిప్ట్ ఫైనల్ చేశారు. వర్మ తీసిన రక్తచరిత్ర, వంగవీటి చిత్రాలు పాత్రల మీదే ఎక్కువ నడుస్తాయి. అయితే ‘కొండా’ బయో ఫిక్షన్. కొండా మురళి, సురేఖమ్మల ప్రేమకథ ఉద్యమంలో నుంచి పుట్టింది. వాళ్ళిద్దరి జీవితంలో జరిగిన సంఘటనలు తీసుకుని కల్పిత కథ రాశారు. బయోపిక్, బయో ఫిక్షన్ మధ్య తేడా ఉంది. జీవితంలో అవరోధాలు వచ్చినప్పుడు పదిలో తొమ్మిది మంది ఆగిపోతారు. ఒక్కడు మాత్రం అన్నిటినీ దాటుకుని ముందుకు వెళ్తాడు. ఆ ఒక్కడి కథే 'కొండా'.  మురళి పాత్రకి బాగా కనెక్టయ్యాను. ఆరేడు కేజీల బరువు పెరిగా. లుక్ కూడా మార్చేశా. చాలా నిర్ణయాల్ని మార్చిన ఘనత సురేఖమ్మది. మదర్ రోల్ కూడా స్ట్రాంగ్‌‌‌‌. ఆ పాత్రలో తులసి, తండ్రిగా ఎల్బీ శ్రీరామ్ నటించారు. సురేఖమ్మ పాత్రలో ఇర్రా మోర్ చక్కగా నటించింది. ఈ మూవీతో నా జీవితమే మారిపోయింది. ప్రేమదేశం, వర్క్ ఫ్రమ్ హోమ్ చిత్రాలు కూడా రిలీజ్‌‌‌‌కి రెడీగా ఉన్నాయి. దేవ కట్టా గారి శిష్యుడు సురేష్ డైరెక్షన్‌‌‌‌లో ఒకటి,  మిస్కిన్ దర్శకత్వంలో మరో సినిమా  ఉన్నాయి.  లైన్‌‌‌‌మేన్‌‌‌‌, కిరాయి సినిమాలు లైన్‌‌‌‌లో ఉన్నాయి.’’