వెంకీ వేదాంతం: ఇదే నా ఆధ్యాత్మిక ప్రయాణం

వెంకీ వేదాంతం: ఇదే నా ఆధ్యాత్మిక ప్రయాణం

సీనియర్ స్టార్ అయినా జూనియర్స్‌‌తో కలిసి మెప్పిస్తూ మల్టీస్టారర్స్‌‌కి కేరాఫ్ అడ్రస్ అయ్యారు వెంకటేష్. తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి ఆయన నటించిన ‘వెంకీమామ’ శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా వెంకటేష్ చెప్పిన విశేషాలు.

చైతూతో నటించడం చాలా ఆనందంగా అనిపించింది. నాన్నగారి కోరిక కూడా నెరవేరింది. చక్కని కథ. ఎమోషనల్, యాక్షన్ ఎలిమెంట్స్ చక్కగా కుదిరిన కమర్షియల్ ఎంటర్‌‌‌‌టైనర్. ఇలాంటి మామా అల్లుడి కథ రావడం కష్టం.  రియల్ లైఫ్ మామా అల్లుడు కలసి నటించడం అరుదు.

ఫ్యామిలీలో ఉండే ఎమోషన్స్‌‌ని స్ట్రాంగ్‌‌గా చెప్పాం. ఫస్ట్ సీన్ నుండే మా ఇద్దరి పాత్రలకు కనెక్టవుతారు. జాతకాల గురించి  చర్చ ఉంది. అవెంత బలంగా ఉన్నా ప్రేమానుబంధాలు వాటన్నింటినీ అధిగమిస్తాయని చూపించాం.

చైతు చిన్నప్పుడు చాలా క్యూట్‌‌గా ఉండేవాడు. తనని హగ్ చేసుకోవడానికి పోటీ పడేవాళ్లం. తను హీరో అయినప్పుడు చాలా థ్రిల్ ఫీలయ్యాను. నాలాగే చైతు కూడా యాక్టర్ అవుదామనుకోలేదు. అనుకోకుండా వచ్చాం. ప్రేక్షకులు ప్రేమతో మమ్మల్ని యాక్సెప్ట్ చేయడం బ్లెస్సింగ్‌‌.

ఇంట్లో నలుగురితో కలసి సరదాగా కూర్చుని మాట్లాడుకోవడం వేరు. సెట్​లో కలసి నటించడం వేరు. అలవాటు పడటానికి చైతుతో పాటు నాకూ కొంత సమయం పట్టింది. వాకింగ్ స్టైల్, శూన్యంలో చూస్తూ ఆలోచించడం లాంటి కొన్ని లక్షణాలు చైతులో కూడా గమనించాను.

నటనకి ఆస్కారముండే  పాత్రలు సృష్టించకపోతే ఆ కథకి న్యాయం జరగదు. మా ఇద్దరి పాత్రల్నీ చక్కగా డిజైన్ చేశారు. ఏ సినిమానైనా సినిమాగానే చూడాలి తప్ప శల్య పరీక్ష చేయొద్దు. ఇక ముప్పై మూడేళ్ల కెరీర్‌‌‌‌లో ఎప్పుడూ నా బర్త్ డేకి సినిమా రిలీజవలేదు. ఫ్యాన్స్ అది గుర్తుచేసి సంతోషపడ్డారు.

‘అసురన్’ షూటింగ్ జనవరి నుండి ప్రారంభమవుతుంది. వేసవిలో విడుదల. శ్రీకాంత్ అడ్దాల కసిగా వర్క్ చేస్తున్నాడు. నాక్కూడా కొత్త తరహా చిత్రం. ఎమోషనే అందులో అతి పెద్ద కమర్షియల్ పాయింట్. ఎఫ్ 2, వెంకీమామ తర్వాత ఇదొక డిఫరెంట్
ఎక్స్‌‌పీరియెన్స్.

ఈ సంవత్సరం ఇద్దరు యంగ్ హీరోలతో నటించడం సంతోషం. ఏ సినిమాలోనైనా సరే నా స్క్రీన్ టైమ్ ఎంత అని ఎప్పుడూ పట్టించుకోలేదు. అలా ఆలోచిస్తే మంచి సినిమాలు చేయలేం. మల్టీస్టారర్స్‌‌కి బెస్ట్ ఆప్షన్ వెంకటేష్ అనేది నిజం కాదు. అదృష్టం కొద్దీ నేను నటించిన మల్టీస్టారర్స్ ఆడుతు
న్నాయి. (నవ్వుతూ) వరుసగా రెండు సినిమాలు ప్లాప్ అయితే.. ఇప్పటికే ఎక్కు వైంది ఇక బ్రేక్ ఇచ్చేద్దామంటారు జనం.

భవిష్యత్ గురించి సూపర్ ప్లాన్స్ వద్దు 
ప్రతిరోజు ఉదయం ఈ రోజు బాగుండాలి అని కోరుకుంటే ఆరోజు అద్భుతంగా ఉంటుంది. నెగిటివ్‌‌గా ఆలోచిస్తే నెగిటివ్‌‌గానే ఉంటుంది. ఎంత మంచి చేసినా మనం చేసే చిన్న తప్పునే వేలెత్తి చూపిస్తుంది లోకం. మన బలాన్ని మనం నమ్ముకోవాలి. చెడుని పట్టించుకోవద్దు.

నేను ప్లాపులొచ్చినా పట్టించుకోను. ఎందుకంటే మంచి సినిమా వస్తే మళ్లీ ఆదరిస్తా రనే నమ్మకం. ఇండివిడ్యు వాలిటీ, ఇగో ఎంత తక్కు వుంటే మనం అంత మంచిది. అదే సమయంలో వృత్తి పట్ల నిజాయతీగా ఉండటం  కూడా ముఖ్యం. మన సామర్థ్యం, పరిధులు ఏమిటో మనం తెలుసుకోగలగాలి. మరొకరితో పోల్చుకో కుండా మన ప్రయాణం కొనసాగించాలి. నా ఆధ్యాత్మిక ప్రయాణంలో నాకు తెలిసింది ఇదే. అదే ప్రయత్నిస్తున్నాను.

సినిమాల్లోకి యాక్సిడెంటల్‌‌గా  వచ్చాను. అందుకే ప్రతిరోజు ఒక బోనస్ అని భావిస్తుంటాను. హార్డ్ వర్క్‌‌ని నమ్ముకున్నాను. నాలో ఇంకా విషయం ఉందని దర్శక నిర్మాతలు నమ్ముతున్నారు కనుక కొనసాగుతున్నాను. అదే లేకపోతే ఎప్పుడో బయటకి పంపేవారు. ఐదేళ్ల నుండి రిటైర్ అయిపోదామనుకుంటున్నాను. కానీ కుదరటం లేదు.  ఏదో ఎనర్జీ నడిపిస్తోంది. అదేమిటన్నది ఎప్పటికీ మిస్టరీనే. ఫలానా రోల్ చేయాలని నాకు లేదు. ఒకప్పుడు వివేకానంద రోల్​ కావాలని ఉండేది. కానీ అలాంటి కథలు రావట్లేదు. ఇక మల్టీస్టారర్స్ విషయంలో నా వయసు హీరోలతో నటించాలని లేదు కానీ జూనియర్ ఎన్టీఆర్‌‌తో మాత్రం నటించాలనుంది. నానితో కూడా అనుకున్నాం కానీ అది కుదరలేదు.