థియేటర్ లో లైగర్ జోడి సందడి

  థియేటర్ లో లైగర్ జోడి సందడి

విజయ్ దేవరకొండ పూరీ కాంబినేషన్లో భారీ అంచనాలతో వచ్చిన లైగర్ మూవీ థియేటర్స్లో సందడి చేస్తోంది. తన కెరీర్లోనే బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులతో కలిసి వీక్షించారు విజయ్. హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ లో హీరోయిన్ అనన్య పాండేతో కలిసి మూవీని చూశారు. 

కాగా మూవీ రిలీజ్ సందర్భంగా థియేటర్స్ వద్ద విజయ్ ఫ్యాన్స్ తీన్మార్ డ్యాన్సులు, భారీ కటౌట్లతో హోరెత్తిస్తున్నారు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈ మూవీలో రమ్యకృష్ణ, మైక్ టైసన్ లు కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ మూవీకి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది.