ప్రభాస్ పెళ్లికి లింక్ పెట్టిన విశాల్.. ఇంకా నయం అంటున్న ఫ్యాన్స్

ప్రభాస్ పెళ్లికి లింక్ పెట్టిన విశాల్.. ఇంకా నయం అంటున్న ఫ్యాన్స్

తన పెళ్లిపై క్రేజీ కామెంట్స్ చేసాడు హీరో విశాల్(Vishal). మధ్యలో ప్రభాస్ ను లాగడంతో ఆ న్యూస్ కాస్త వైరల్ గా మారింది. తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న విశాల్ కు తన పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. దానికి కూల్ గా స్పందించిన విశాల్..  “పెళ్లి అనేది జోక్ కాదు. అది ఒక బాధ్యత. నాకు ఇప్పుడు ప్రొఫెషనల్ గా ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. ప్రొఫెషనల్ లైఫ్ లో ఎంత డెడికేషన్ తో ఉంటామో పర్సనల్ లైఫ్ లో కూడా అలాగే ఉండాలి.  పెళ్ళి జీవితానికి తగ్గట్టు నా మైండ్ ఇంకా సెట్ కాలేదు” అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక చివరిగా "ప్రభాస్ పెళ్లి చేసుకున్నప్పుడు నేను చేసుకుంటా” అంటూ సరదాగా కామెంట్ చేసాడు. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఇక విశాల్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన మార్క్ ఆంటోనీ (Mark Antony) సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియాలో లెవల్లో తెరకెక్కుతున్న ఈ మూవీకి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత విశాల్ డిటెక్టీవ్ 2(Ditective 2) సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకి విశాల్ దర్శకత్వం వహిస్తుండటం విశేషం.