ఏపీ రాజకీయాల్లోకి రావడం లేదు

ఏపీ రాజకీయాల్లోకి రావడం లేదు

టీడీపీ అధినేత చంద్రబాబు పై కుప్పం నియోజక వర్గం‌ నుంచి హీరో విశాల్ పోటీ చేస్తారంటూ  కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ విషయం‌  ట్రెండింగ్ గా మారటంతో.. ఈ రూమర్స్‌పై విశాల్ స్పందించారు. తాను ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి వస్తున్నానని.. కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నానని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు. తనపై అసత్య ప్రచారం జరుగుతోందని.. వాటన్నింటినీ ఖండిస్తున్నట్లు విశాల్ ప్రకటించారు. రాజకీయాలకు సంబంధించి తాను ఇప్పటివరకూ ఎవరిని కలవలేదని.. ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియటం లేదన్నారు. తాను ప్రస్తుతం సినిమాలతో బిజీగా గడుపుతున్నానని, రాజకీయాల్లోకి రావాలనే కోరిక తనకు లేదన్నారు. ఇక చంద్రబాబు నాయుడుపై పోటీ చేయాలనే ఉద్దేశం తనకు ఎంత మాత్రం లేదని విశాల్ స్పష్టం చేశారు.