హ్యాట్రిక్ విజయాలపై హీరోల ఆశలు

హ్యాట్రిక్ విజయాలపై హీరోల ఆశలు

టాలీవుడ్లో సినిమా హిట్టయితే..ఓ లెక్క..ఫట్టయితే మరో లెక్క. ఫ్లాప్ అయితే అంచనాలు పూర్తిగా తలకిందులవుతాయి. కానీ..హిట్ అయితే మాత్రం ఆ హీరోపై  ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో పెరిగిపోతాయి. అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలని హిట్ కొట్టిన హీరో తపనపడుతుంటాడు. తర్వాతి సినిమా ఇంతకంటే పెద్ద హిట్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటాడు. రెండో సినిమా కూడా సూపర్ హిట్ అయితే..ఆ హీరో మీద ప్రెజర్ 100 శాతం పెరిగిపోతుంది. వరుసగా రెండు హిట్లు కొట్టిన హీరో..ఎలాగైనా హ్యాట్రిక్ సాధించాలని..కసితో మూడో సినిమాకు పనిచేస్తుంటారు. ప్రస్తుతం టాలీవుడ్లో ఇదే ట్రెండ్ నడుస్తోంది. హ్యాట్రిక్ విజయాన్ని ఖాతాలో వేసుకుని ఫ్యాన్స్ను ఫుల్ ఖుషీ చేయాలని నలుగురు హీరోలు తహతహలాడుతున్నారు. 

పీకేకు మూడొస్తుందా? 
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం హ్యాట్రిక్ విజయంపై గురిపెట్టాడు. అజ్ఞాతవాసి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పాడు పీకే. అయితే ఫ్యాన్స్ కోరిక మేరకు రీ ఎంట్రీ ఇచ్చాడు. 2021లో వకీల్ సాబ్తో హిట్ కొట్టాడు. ఆ తర్వాత భీమ్లా నాయక్తో సూపర్ హిట్ అందుకున్నాడు. వరుసగా రెండు విజయాలు దక్కడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఒక్కసారిగా పవర్ స్టార్పై అభిమానుల అంచనాలు గతంలో ఎన్నడు లేని విధంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం పవన్ క్రిష్ దర్వకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు. టైటిలే ఆసక్తికరంగా ఉంది. దీనికి తోడు దర్శకుడు క్రిష్ కావడంతో..ఈ సినిమాపై వీరలెవల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో అంచనాలను ఎలా అందుకోవాలని పవర్ స్టార్ తెగ వర్రీ అవుతున్నాడట. వీరమల్లుతో ఎలాగైనా హ్యాట్రిక్ విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని ప్లాన్స్ వేస్తున్నాడని టాక్.

బన్నీకి బంపర్ హిట్ దక్కుతుందా.!
ఒక్కో సినిమాతో తన రేంజ్ను పెంచుకుంటూ పోతున్నాడు అల్లు అర్జున్. ఆల వైకుంఠపురంలో సినిమా ఇచ్చిన విజయంతో ఒక్కసారిగా ఐకాన్ స్టార్గా మారాడు. ఈ సినిమా అనుకున్నదాని కంటే బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ మూవీని బాలీవుడ్లోనూ రీమేక్ చేయడం విశేషం. ఆ తర్వాత బన్నీ.. పుష్ప మూవీతో వేరే లెవల్ హిట్ కొట్టాడు. తెలుగుతో పాటు.. హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో తగ్గేదేలే అంటూ సూపర్ హిట్గా నిలిచింది. పుష్ప ఇచ్చిన కిక్తో ఐకాన్ స్టార్ పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు.  వరుసగా రెండు సూపర్ హిట్లు ఖాతాలో వేసుకున్న బన్నీ..ఇప్పుడు హ్యాట్రిక్ విజయంపై కన్నేశాడు. పుష్పలో బన్నీ చేసిన పర్ఫామెన్స్తో  పుష్ప-2పై ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా పెరగలేదు. పుష్ప సినిమా కేవలం 50 రోజుల్లో 350 కోట్లకు పైగా గ్రాస్ను వసూలు చేసింది. పుష్ప-2తో పుష్ప మూవీకి మించి విజయాన్ని సాధించి..హ్యాట్రిక్ హీరోగా నిలవాలని భావిస్తున్నాడు. సీక్వెల్తో బన్నీ సీటీమార్ అంటాడో లేదో చూడాలి.  

అడవి శేషుకు మేజర్ హిట్టిస్తుందా ?
టాలీవుడ్లో విభిన్న కథలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు అడవి శేషు. అడవి శేషు సినిమా చేశాడంటే అది మంచి కథ అయి ఉంటుందని ప్రేక్షకులు నమ్ముతారు. అందుకే అతను ష్యూర్ హిట్ హీరోగా మారాడు.చిన్న సినిమాలతో కూడా..మ్యాజిక్ చేస్తున్నాడు. గుఢచారి,ఎవరు లాంటి ఆకట్టుకునే సబ్జెక్ట్ లతో..ప్రేక్షకులతో పాటు..విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు మూడో విజయం కోసం..మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ బయోగ్రఫిని ఎంచుకున్నాడు.ఇది రియల్ లైఫ్ స్టోరీ కావడంతో మేజర్ మూవీపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇది దేశ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా హిట్టయితే మాత్రం అడవి శేషు పాన్ ఇండియా రేంజ్కు ఎదగనున్నాడు. తన సినిమా కెరియర్కు మేజర్ మూవీ టర్నింగ్ పాయింట్ కావడంతో ఫ్యాన్స్తో పాటు అడవి శేషు కూడా విజయంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. 

వారియర్పై ఆశలు..
హలో గురూ ప్రేమ కోసమే డిజాస్టర్ తర్వాత ఇస్మార్ట్ శంకర్ లాంటి డిఫ్రెంట్ కథతో వచ్చి హిట్ కొట్టాడు రామ్ పోతినేని. తెలంగాణ యాసతో ప్రేక్షకున్ని థియేటర్కు  రప్పించాడు. ఆ తర్వాత రెడ్ సినిమాతో డీసెంట్ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం హ్యాట్రిక్ విజయాన్ని సాధించేందుకు ది వారియర్గా వస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది. పైగా తొలిసారి రామ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వారియర్ మూవీపై అభిమానుల్లో హైప్ క్రియేట్ అయింది. దీంతో మరోసారి రామ్ హిట్ కొడతాడనే టాక్ టాలీవుడ్లో నడుస్తోంది. అదే జరిగితే రామ్ హ్యాట్రిక్ ఆశలు నెరవేరుతాయి.