
అదా శర్మ నటించిన ‘ది కేరళ స్టోరీ’కి ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన వస్తోంది. లవ్ జిహాద్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా సంచలనంగా మారింది. దీంతో ఈ హీరోయిన్ ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. తెలుగులో పూరి ‘హార్ట్ ఎటాక్’తోనే ఎంట్రీ ఇచ్చినా.. ఈ సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. ఆ తర్వాత అన్నీ సెకండ్ లీడ్ పాత్రలే చేసింది.
అటు హిందీలోనూ చెప్పుకోదగ్గ హిట్స్ లేవు. ఈ టైంలో ఈ అమ్మడుకి కేరళ స్టోరీతో సరైన హిట్ పడింది. దీంతో అన్ని భాషల్లో ఈ భామ బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కథక్ డ్యాన్సర్ అయిన అదా ఇంటర్‌తోనే చదువుకు పుల్‌స్టాప్ పెట్టిందట. అన్ని రకాల డ్యాన్స్ ఫామ్స్‌పై ఇష్టాన్ని పెంచుకుంది. అదే టైంలో సినిమా అవకాశాలు ఆమెను పలకరించాయి. తాజా విజయం ఆమె కెరీర్‌కు ఏ విధంగా కలిసొస్తుందో చూడాలి మరి.