
గజినీ సినిమాతో ప్రేక్షకుల మదిలో నిలిచిన అసిన్తన వైవాహిక జీవితానికి ఫుల్స్టాప్ పెట్టబోతున్నారా. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అతి తక్కువ కాలంలోనే మంచి నటిగా పేరు తెచ్చుకున్న ఆమె పెళ్లయ్యాక ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఆమె 2016లో మైక్రో మ్యాక్స్వ్యవస్థాపకుడు రాహుల్ శర్మను వివాహం చేసుకుంది. ఆ దంపతులకు 2017లో అరిన్ అనే పాప పుట్టింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో భర్తతో ఉన్న పర్సనల్ ఫొటోలు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసేది. అయితే ఇటీవల ఆమె తన భర్తతో ఉన్న అన్ని ఫొటోలను తొలగించింది.ఆమె పెళ్లి ఫొటోలు కూడా అందులో ఉండటం అభిమానులకు షాక్ ఇస్తోంది. దీంతో ఆమె భర్త నుంచి విడాకులు తీసుకోబోతుందనే చర్చ సినీ ఇండస్ట్రీలో జరుగుతోంది.
ప్రజలకు ఉపయోగపడే విషయాలపై ఫోకస్ పెడితే మంచిది..
ఈ విషయమై అసిన్ స్పందిస్తూ.. ఈ రూమర్స్ ఎలా పుట్టుకొస్తుయో ఏమో.. తాను తన భర్తతో కలిసి హాలీ డేస్‌ను ఎంజాయ్ చేస్తున్నామని అన్నారు. అంతా ఓకే అనుకుంటే.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు డీలీట్ చేయడం ఎందుకు అనే ప్రశ్నకు సమాధానంచెబుతూ.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పేస్ కోసమే ఇదంత చేసినట్టు చెప్పుకొచ్చింది. ఇక మీడియా కూడా మా విడాకుల గురించి కాకుండా.. ప్రజలకు ఉపయోగపడే విషయాలపై దృష్టి పెడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. చూడాలి మరి ఈ రూమర్స్ ఇంతటితో ఆగిపోతాయా లేదా అని.
బాలీవుడ్లో ఫేమస్ చిత్రం గజినీలో అసిన్ అమీర్‌ఖాన్, తమిళ్లో సూర్యతో కలిసి హీరోయిన్గా నటించింది. ఈ సినిమాతోనే తన ట్యాలెంట్‌ని ప్రపంచానికి చూపింది. ఆ తరువాత హిందీలో అక్షయ్‌కుమార్‌తో కలిసి కొన్ని సినిమాల్లో నటించింది. తెలుగులోని స్టార్ హీరోలందరితో దాదాపు నటించి ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకుంది. అసిన్ చివరిసారిగా 2015లో విడుదలైన 'ఆల్ ఈజ్ వెల్'లో కనిపించింది. టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనితో డేటింగ్ చేశారనే వార్తలు అప్పట్లో సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి.