హీరోతో కలిసి ఆటోలో షికారు చేస్తోన్న కీర్తి సురేష్.. వీడియో వైరల్

హీరోతో కలిసి ఆటోలో షికారు చేస్తోన్న కీర్తి సురేష్.. వీడియో వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy Suresh) కు బాలీవుడ్ నుంచి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఒక రెండు మూవీస్కి ఒకే చెప్పినట్లు సమాచారం. ప్రసెంట్ బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan) హీరోగా నటిస్తున్న మూవీలో కీర్తీ నటిస్తుందని తెలుస్తోంది. లేటెస్ట్గా వీరిద్దరూ కలిసి ముంబై నగర వీధుల్లో ఆటోలో షికారు చేస్తున్న వీడియో  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వరుణ్ ఒంటి మీద షర్ట్ లేకుండా కనిపిస్తుండటంతో.. నెటిజన్స్ నుంచి భిన్నమైన కామెంట్స్ వినిపిస్తోన్నాయి. వరుణ్ ఎవ్వరిని వదిలి పెట్టడంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

వరుణ్ కేవలం బనీను వేసుకుని..కీర్తి మెహందీ పెట్టుకుని జీన్స్, టీ షర్ట్ తో కనిపిస్తోంది. ఇక వీరిద్దరూ ఆటోలో ట్రావెల్ చేస్తూ నవ్వుతూ కనిపిస్తున్నారు. దీంతో బాలీవుడ్లో కీర్తి నటిస్తున్నట్లు కన్ఫర్మ్ అయింది. వరుణ్‌18వ సినిమాగా వస్తోన్న ఈ మూవీని తమిళ డైరెక్టర్ కాలిస్ డైరెక్ట్ చేస్తున్నాడు. మాస్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లబోతోందని సమాచారం. 

కీర్తి సురేష్ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా భోళాశంకర్ మూవీలో చివరిసారిగా కనిపించింది. కీర్తి సురేష్ ప్రసెంట్ సౌత్లో ఐదు సినిమాల్లో నటిస్తుంది. ఈ ఐదు సినిమాలు లేడీ ఓరియంటెడ్ కావడం విశేషం. అంతేకాకుండా, ఈ మూవీస్ అన్ని తమిళ్ ఇండస్ట్రీకి చెందినవే.

ఇక హీరో వరుణ్ విషయానికి వస్తే..డైరెక్టర్ అట్లీ తేరి రీమేక్ తో పాటు బ్యూటీ సమంతతో కలిసి సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఈ సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది.
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Voompla (@voompla)