అంచనాలకు మించి గేమ్ ఛేంజర్.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన కియారా

అంచనాలకు మించి గేమ్ ఛేంజర్.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన కియారా

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara Advani) ప్రస్తుతం తెలుగులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan), స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్(Game changer) సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై నేషనల్ వైడ్ గా భారీ అంచనాలున్నాయి. 

తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న కియారా గేమ్ ఛేంజర్ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పకొచ్చింది. ఇందులో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆమె.. రాంచరణ్‌ నా ప్రియమైన స్నేహితుడు. డైరెక్టర్ శంకర్‌ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆయన విజన్, ఆయన టేకింగ్ నెక్స్ట్ లెవల్.  గేమ్‌ ఛేంజర్‌ సినిమాను అద్భుతంగా డిజైన్‌ చేశారు. ప్రతీ ఒక్కరి అంచనాలను మించేలా ఈ సినిమా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ ఒక్క అప్‌డేట్‌తో సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకుంటున్నాయి. ఇక మెగా అభిమానులైతే పండగ చేసుకుంటున్నారు.  

ఇక గేమ్ ఛేంజర్ సినిమా విషయానికి వస్తే.. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు(Dill raju) నిర్మిస్తున్నారు. తమన్(Thaman) సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో.. శ్రీకాంత్(Srikanth), అంజలి(Anjali), నవీన్ చంద్ర(Naveen chandra), సునీల్(Sunil) తదితరులు కీ రోల్ లో కనిపించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.