పెళ్లి చేసుకోకపోతే..కొవ్వు పట్టినట్లా..? బలుపు ఎక్కినట్లా..? హీరోయిన్ మాధవీలత

పెళ్లి చేసుకోకపోతే..కొవ్వు పట్టినట్లా..? బలుపు ఎక్కినట్లా..? హీరోయిన్ మాధవీలత

నచ్చావులే మూవీతో టాలీవుడ్ కు పరిచమైంది యాక్టర్ మాధవీలత. ఆ తర్వాత స్నేహితుడా, ఉసురు, అరవింద్ 2 వంటి సినిమాల్లో నటించింది. అనంతరం బీజేపీలో చేరి 2019లో పోటీ చేసి ఓడిపోయింది. అయినా కూడా పార్టీ కార్య కలాపాల్లో బాగానే పాల్గొంటుంది. అయితే ఖాళీ దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో పోస్టులు, ఫోటోలు షేర్ చేస్తూ సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవలే తన ఫోటోలను  సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..వాటికి కొందరు నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ పై  మాధవీలత సమాధానం ప్రస్తుతం వైరల్ అయింది. 

తన ఫోటోలపై ఓ నెటిజన్ కోపం తెప్పించే కామెంట్ పెట్టాడు. పెళ్లి పెటాకులు లేకుండా కొవ్వెక్కి బలిసి కొట్టుకుంటున్నావ్ అంటూ కామెంట్ చేశారు. ఈ కామెంట్ పై మాధవీలత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ కామెంట్ పెట్టిన వాడికి సమాధానంగా ఇన్ స్టాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇన్స స్టాలో తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై మాట్లాడిన మాధవీలత..పెళ్లిపెటాకులు లేక కొవ్వెక్కి బలిసి కొట్టుకుంటున్నావ్ అని ఒకడు అంటున్నాడు.... అందుకే వాడికి సమాధానం చెప్తున్నా అంటూ వీడియో మొదలుపెట్టింది.

నన్ను ఇవాళ ఒకడు ఫేస్ బుక్ లో తిట్టాడు.  నీకు పెళ్లి పెటాకులు లేక..కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడు బలిసి అంటున్నాడు.  పెళ్లి చేసుకోకపోతే కొవ్వెక్కి కొట్టుకుంటామా..?  అంటే పెళ్లి చేసుకున్నోళ్లకు బలుపు దిగిపోతుందా..? అంటే బలుపు దిగిపోయే కార్యక్రమమే పెళ్లా.?  అంటే మన వ్యక్తిత్వాన్ని చంపేసుకునేది పెళ్లి అవుతుందా..?  ఇప్పుడు ఆడపిల్లకు మొగుడొస్తే కొవ్వు దిగుతది..! అమ్మా నాన్నలు ఉంటే కొవ్వు బలుపు ఉండకూడదు. ఇప్పుడు వాడు..పెళ్లి లేదు..పెటాకులు లేదన్నాడు. మంచిదే కదా..పెటాకులు అంటే విడాకులే కదా..ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని..విడాకులు ఇచ్చేస్తే మంచిదాన్ని అయిపోతనా..? అంటే పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చేస్తే నా బలుపు దిగిపోతుందా..? వాడి ఉద్దేశం ఏంటంటారు..? వాడి ఉద్దేశం ఏదైనా కానీ..నాకు పెళ్లి పెటాకులు లేనందు వల్ల నాకు బలుపు ఉంది. నాకు ఆత్మాభిమానం ఉంది. అంతే కదా..? హు...ఇంట్రస్టింగ్...! అంటూ చెప్పుకొచ్చింది.. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.