ర్యాబోషాప్కా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘డేవిడ్ రెడ్డి’. మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీకి హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్నాడు. వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు. ఆదివారం హీరోయిన్ మారియా ర్యాబోషాప్కా బర్త్‌డే సందర్భంగా స్పెషల్ పోస్టర్‌తో ఆమెకు విషెస్ తెలియజేశారు మేకర్స్. పియానో వాయిస్తున్న అందమైన లుక్‌లో మారియా కనిపిస్తుంది.
క్లాసిక్ బ్యాక్‌డ్రాప్, ఎమోషనల్ టోన్‌తో రూపొందించిన ఈ పోస్టర్‌పై ‘నా యుద్ధ ప్రపంచంలో, నువ్వు నా శాంతిగా మారావు’ అని క్యాప్షన్ ఉండటం సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రంలో ఆమె బ్రిటీష్ యువరాణి క్లారా పాత్రలో కనిపించనుంది.
1897–1920 నాటి బ్యాక్‌డ్రాప్‌తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో బ్రిటీష్ సామ్రాజ్యానికి ఎదురు నిలిచిన యోధుడిగా మంచు మనోజ్ కనిపించనున్నాడు. ఆర్. పార్తీబన్, కాంచన ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.
