Mrunal Thakur: నావల్ల కాలేదు.. తెలుగులో సినిమాలు చేయను.. మృణాల్ కామెంట్స్ వైరల్

Mrunal Thakur: నావల్ల కాలేదు.. తెలుగులో సినిమాలు చేయను.. మృణాల్ కామెంట్స్ వైరల్

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఆమె నటించిన మొదటి సినిమా సీతారామం(SitaRamam) ఇక్కడి ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. కేవలం తెలుగులోనే కాదు పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. దీంతో ఈ మృణాల్ కు తెలుగులో వరుస అవకాశాలు వరించాయి. ఇటీవలే నేచురల్ స్టార్ నానితో హాయ్ నాన్న సినిమా చేసి డీసెంట్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. ప్రెజెంట్ విజయ్ దేవరకొండతో ది ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తోంది. 

దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్, ట్రైలర్ తో ఆసక్తి కలిగించిన ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక తాజాగా మూవీ ప్రమోషన్స్ కోసం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఆసక్తర కామెంట్స్ చేశారు.. తెలుగులో మొదటి అవకాశం వచ్చినప్పుడు భాష తెలియనప్పుడు సినిమా చేయగలనా అనుకున్నాను. కొన్నిసార్లు నావల్లకాదు వదిలేద్దాం అనుకున్నాను, ఒంటరిగా ఏడ్చేశాను కూడా. కానీ, ఆ కన్నీళ్లు వృథా పోలేదు. సీతారామం సినిమా కారణంగా నాకు  ప్రశంసలు దక్కాయి. 

ఈ సినిమా చేస్తున్న సమయంలో ఇదే నా చివరి సినిమా, ఇక తెలుగులో సినిమాలు చేయను అని దుల్కర్ తో చెప్పాను కూడా. కానీ, ఇప్పుడు అన్ని భాషల్లో నటిస్తున్నాను. దానికి కారణం దుల్కర్ సల్మాన్. అందుకే అతను నాకు ఇప్పటికే ఫేవరెట్ హీరో.. అంటూ చెప్పుకొచ్చాడు మృణాల్. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

ALSO READ :- ఓన్లీ క్యాష్ ఆటోవాలా : గూగుల్ పే లేదని.. ఆటోను ATM దగ్గర ఆపను