Mrunal Thakur: ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను.. అందుకే చాలా బాధేసింది: మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను.. అందుకే చాలా బాధేసింది: మృణాల్ ఠాకూర్

టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతోంది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur). ఇటీవల ఆమె హీరోయిన్ గా నటించిన ది ఫ్యామిలీ స్టార్(The Family Star) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ను ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. దాంతో.. తెలుగులో మెదటి ప్లాప్ ను తన ఖాతాలో వేసుకుంది మృణాల్. అయితే.. మృణాల్ ఇప్పటికి చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఆమెను సీతారామం బ్యూటీ అనే పిలుస్తున్నారు ఆడియన్స్. అంతలా సీతామహాలక్ష్మి పాత్రలో ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు మృణాల్. 

అందుకే తన సినీ కెరీర్ లో సీతారామం సినిమా చాలా స్పెషల్ అని చెప్పుకుంటారు మృణాల్. తాజాగా మరోసారి ఆ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు మృణాల్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సీతారామం సినిమా నా సినీ జర్నీలో చాలా స్పెషల్ మూవీ. సినిమా పూర్తి చేసి ఇంటికి వెళ్తుంటే నా గుండె బరువెక్కింది. ఒక పాత్రకు ఎమోషనల్ గా కనెక్ట్ అయితే రిజల్ట్ అలాగే ఉంటుంది. అలా కనెక్ట్ అయిన పాత్ర సీతామహాలక్ష్మీ. ఆ పాత్ర నుండి బయటికి రావడానికి కూడా చాలా సమయం పట్టింది.. అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు మృణాల్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక మృణాల్ ఠాకూర్ సినిమాల విషయానికి వస్తే.. ది ఫ్యామిలీ స్టార్ తరువాత మరో తెలుగు సినిమాకు ఒకే చెప్పలేదు ఈ బ్యూటీ. ఆ మధ్య చిరంజీవి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభరలో నటించనుంది అనే వార్తలు వచ్చాయి కానీ, ఆ విషయం మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు.