Mrunal Thakur: బాడీ పార్ట్స్ని జూమ్ చేసి మరీ.. షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్

Mrunal Thakur: బాడీ పార్ట్స్ని జూమ్ చేసి మరీ.. షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్

సీతారామమ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవలే నాచురల్ స్టార్ నానితో హాయ్ నాన్న సినిమా చేసింది ఈ బ్యూటీ. కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఆశించిన విజయాన్ని సాధించలేదు. అలా తెలుగులో మొదటి ప్లాప్ ను తన ఖాతాలో వేసుకుంది మృణాల్. 

ప్రస్తుతం ఆమె రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇటీవలే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. 

ఇదిలా ఉంటే.. తాజాగా మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియా ట్రోలింగ్స్, మార్ఫింగ్స్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఆమె ఈ విషయం గురించి మాట్లాడుతూ.. సినిమా హీరోయిన్లను చాలా మంది ఒక వస్తువులా చూస్తున్నారు. వారి ఫోటోలలో కొన్ని భాగాలపై ఫోకస్‌ చేసి, జూమ్‌ చేసి దారుణంగా కామెంట్లు చేస్తున్నారు.అంతేకాదు.. ఆ ఫోటోలను రకరకాలుగా మార్ఫింగ్ చేసి సోషల్‌ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. ఈ విషయంలో నేను కూడా బాధితరాలునే, నా ఫోటోలను కూడా అలా చేశారు. అవి చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది.. అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు మృణాల్. ప్రస్తుతం మృణాల్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.