Nivetha Pethuraj: కారు డిక్కీలో ఏముంది.. పోలీసులతో గొడవకు దిగిన హీరోయిన్

Nivetha Pethuraj: కారు డిక్కీలో ఏముంది.. పోలీసులతో గొడవకు దిగిన హీరోయిన్

సౌత్ హీరోయిన్ నివేదా పేతురాజ్(Nivetha Pethuraj) పోలీసులతో వాగ్వాదానికి దిగింది. చెక్కింగ్ కోసం వచ్చిన పోలీసులతో దురుసుగా ప్రవర్తించింది. ఇదంతా పక్కన వ్యక్తి ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. తాజాగా నివేతా పేతురాజ్‌ తన కారులో వెళ్తుంటే చెకింగ్‌ పేరుతో పోలీసులు ఆమెను ఆపారు.

పోలీసులు ఆమెను కారు డిక్కీ ఓపెన్‌ చేయమని కోరడంతో.. అందుకు ఆమె నిరాకరించింది. ఎందుకు ఓపెన్ చేయాలో కారణం చెప్పాలని గొడవకు దిగింది. అవసరమైన పేపర్లు అన్నీ ఉన్నాయి కావాలంటే చూసుకోండి, కారు డిక్కి మాత్రం ఓపెన్‌ చేయను, అది నా పరువుకు సంబంధించిన విషయం, చెప్పినా మీకు అర్థం కాదు.. అంటూ పోలీసులతో గొడవకు దిగుతుంది. ఇదంతా పక్కన ఉన్న వ్యక్తి వీడియో తీస్తుంటే.. వీడియో ఏండుకు తీస్తున్నారు అంటూ మొబైల్ కవర్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

అయితే.. ఈ వీడియోను కొంతమంది నిజమని నమ్ముతుంటే.. మరికొందరేమో ఏదైనా సినిమా ప్రమోషన్ కోసం అయుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజంగా నివేదా పేతురాజ్ పోలీసులతో గొడవ పడిందా... లేదా ఏదైనా సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా ప్రాంక్ చేశారా అనేది తెలియాల్సి ఉంది. ఆ వీడియో చూస్తే మీకు ఏమనిపించింది కామెంట్ చేయండి.

Also Read:తడిచీరలో ప్రియాంక జైన్ అందాల ఆరబోత.. వీడియో వైరల్