ఉహలు గుసగుసలాడే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ హీరోయిన్ రాశీ కన్నా. అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన సినిమాలన్నింటిలో నటించి మంచి స్టార్డమ్ తెచ్చుకుంది. రీసెంట్గా తమన్నా, రాశిఖన్నాలు కలిసి 'అరుణ్మణై4' అనే సినిమాలో నటించి మంచి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది.
ప్రస్తుతం తెలుగులో సిద్దు జొన్నలగడ్డ సరసన 'తెలుసు కదా' అనే మూవీతో పాటు, తమిళంలో 'అగాథియా' అనే పిరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్లో నటిస్తోంది. ఈ ముద్దుగమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది. దక్షిణాదిలో సినిమా అంటే అభిమానించేవారెక్కువని చెప్పింది. హీరోలని దేవుళ్లుగా కొలుస్తారని తెలిపింది.
మూవీ రిలీజ్ అయినప్పుడు పండుగలా భావిస్తారని తెలిపింది. దక్షిణాదిలో ప్రేక్షకులు తిండి అయినా మానేస్తారేమో కానీ సినిమాలు చూడటం మాత్రం ఆపరుని చెప్పింది. అదే నార్త్ ప్రజలు సినిమాలు పక్కన పెట్టి మిగతా వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని చెప్పుకొచ్చింది. రాశీఖన్నా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.