NTRNeel: ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ స్పెషల్ సాంగ్.. తారక్తో చిందేయనున్న స్టార్ హీరోయిన్

NTRNeel: ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ స్పెషల్ సాంగ్.. తారక్తో చిందేయనున్న స్టార్ హీరోయిన్

ఎన్టీఆర్ అభిమానులతో పాటు, పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రశాంత్ నీల్ మూవీ చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభం అయింది. ఇటీవలే ఎన్టీఆర్ షూట్లో జాయిన్ అయ్యాడు. లేటెస్ట్గా ఈ మూవీ నుంచి కొత్త టాక్స్ మొదలయ్యాయి. 

అదేంటంటే.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. కర్ణాటకలో భారీ సెట్ నిర్మించాడట. మెజార్టీ షూటింగ్ పార్ట్ అక్కడే చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేగాక ఈ సినిమాలో మేకర్స్ ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారట. ఆ పాట కోసం నేషనల్ క్రష్ రష్మిక మందన్నను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో, మీడియా సర్కిల్స్లో ప్రచారం తెగ జరుగుతోంది.

బ్యాక్ టు బ్యాక్ యానిమల్,పుష్ప 2, ఛావాతో బాక్సాఫీస్ వద్ద భారీ హిట్స్ అందుకున్న, రష్మిక సైతం సాంగ్ చేయడానికి ఒప్పుకుందట. త్వరలో ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉందని రూమర్ వినిపిస్తోంది. ఈ క్రేజీ టాక్తో సినిమాకు మంచి హైప్ క్రియేట్ అవుతుంది.

ఈ మూవీ వచ్చే ఏడాది 2026 జూన్ 25న వరల్డ్‌‌‌‌‌‌‌‌వైడ్‌‌‌‌‌‌‌‌గా విడుదల చేయనున్నట్టు ఏప్రిల్ 29న (మంగళవారం) ప్రకటించారు. వాస్తవానికి ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేయాలని భావించింది టీమ్.

అయితే సినిమాకున్న స్పాన్‌‌‌‌‌‌‌‌ను దృష్టిలో ఉంచుకుని, పోస్ట్ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌కు ఎక్కువ సమయం పడుతుందని భావించిన టీమ్.. రిలీజ్‌‌‌‌‌‌‌‌ను  మరో ఆరు నెలలు వాయిదా వేశారు. అయితే ఈ చిత్రం ఎప్పుడు వచ్చినా థియేటర్స్ దద్దరిల్లేలా ఉంటుందని  మేకర్స్ చెబుతున్నారు.  ఈలోపు ఎన్టీఆర్ బర్త్‌‌‌‌‌‌‌‌డే సందర్భంగా మే 20న స్పెషల్ గ్లింప్స్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేయనున్నట్టు తెలియజేశారు

ఎన్టీఆర్ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది 31వ చిత్రం. ‘డ్రాగన్‌‌‌‌‌‌‌‌’అనే టైటిల్ ప్రచారంలో ఉంది. హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా రుక్మిణీ వసంత్, కీలకపాత్రలో టొవినో థామస్ కనిపిస్తారని తెలుస్తోంది.  మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌‌‌‌‌‌‌‌పై కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.