మణిరత్నం మాయ.. త్రిష హవా

మణిరత్నం మాయ..  త్రిష హవా

తమిళ స్టార్ డైరెక్టర్ తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో త్రిష తన గ్లామర్ తో కట్టిపడేసింది. సినిమాలో చాలామంది ముద్దుగుమ్మలున్నా వారందరినీ పక్కకి నెట్టి యువరాణి కుందవై పాత్రలో ఆడియన్స్ చూపులు తనవైపుకు తిప్పుకుంది. రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా ఈ బ్యూటీకి మాత్రం పొన్నియన్ సెల్వన్ మంచి హైప్ ను తీసుకొచ్చింది. దీంతో త్రిష క్రేజ్ మరో స్థాయికి చేరింది. 

ఇప్పటికే ఆమె చేతిలో దాదాపు అరడజను సినిమాలున్నాయి. అందులో విజయ్ లియో, అజిత్ విడాముయర్చి వంటి స్టార్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. ఇక తాజాగా మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసేందుకు సిద్ధమైంది. ఈ జానర్ లో తన రెండో సినిమాను బిగ్ బ్యానర్ వేల్స్ ఫిలింస్ సంస్థతో చేయనుంది. గౌరవ్ నారాయణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను అన్ని సౌత్ భాషల్లో విడుదల చేసే ప్లాన్లో ఉన్నారు మేకర్స్.