అలాంటి నీచులతో ఇకపై పని చేయను.. త్రిష షాకింగ్ కామెంట్స్

అలాంటి నీచులతో ఇకపై పని చేయను.. త్రిష షాకింగ్ కామెంట్స్

తమిళ సీనియర్ నటుడు మన్సూర్ అలీ ఖాన్(Mansoor ali khan) హీరోయిన్ త్రిష(Trisha)పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారాయి. త్రిషను ఉద్దేశించి అలా నీచంగా మాట్లాడటంపై కోలీవుడ్ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేచేస్తున్నాయి. ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారికి సినిమాల్లో అవకాశాలు ఇవ్వకూడదని డిమాండ్ చేస్తున్నాయి. 

ఇక ఇదే విషయంపై త్రిష సోషల్ మీడియా వేదికగా స్పందించారు.. నటుడు మన్సూర్ అలీ ఖాన్ నా గురించి నీచంగా మాట్లాడిన వీడియో నా దృష్టికి వచ్చింది. వాటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒకరకంగా ఇది లైంగికంగా, స్త్రీ ద్వేషపూరితంగా, అసహ్యకరంగా చేసిన పనిలా అనిపిస్తోంది. ఇకపై అలాంటి నీచమైన వ్యక్తితో సినిమాలు చేయను. ఇలాంటి వారు మానవాళికి చెడ్డపేరు.. అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన ఆడియన్స్ అండ్ త్రిష ఫ్యాన్స్ కూడా నటుడు మన్సూర్ అలీ ఖాన్ పై మండిపడుతున్నారు.  
 
మన్సూర్ అలీ ఖాన్ కామెంట్స్ పై లేవు దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కూడా ట్వీట్‌లో స్పందించారు.. మేము అందరం ఒకే టీమ్‌లో పనిచేశాం. స్త్రీల పట్ల మన్సూర్ అలీ ఖాన్ చేసిన ద్వేషపూరిత వ్యాఖ్యలు విని చాలా కోపంగా వస్తోంది. అతని మాటలను, ప్రవర్తనను 
నేను తీవ్రంగా ఖండిస్తున్నా. మహిళలను, తోటి నటీనటులను మనం గౌరవించాలి. ఏ పరిశ్రమలోనైనా  ఇది చాలా అవసరం.. అని రాసుకొచ్చారు లోకేష్. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.