
హైదరాబాద్: తాజాగా బెంగళూరులో ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌ను ఓపెన్ చేసిన ఫర్నిచర్ కంపెనీ హెట్టిచ్, హైదరాబాద్‌లో అప్‌గ్రేడ్ చేసిన తన ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌ను ప్రారంభించింది.
దక్షిణ భారత మార్కెట్‌పై తమకున్న నిబద్ధతకు ఇది నిదర్శనమని కంపెనీ పేర్కొంది. జర్మన్ ఇంజినీరింగ్‌తో రూపొందిన ఇంటీరియర్ సొల్యూషన్లను భారత వినియోగదారుల కోసం అందుబాటులోకి తెస్తామని తెలిపింది.
ఈ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌లో ప్రీమియం బ్రాండ్లను కోరుకునే వినియోగదారులు కొత్త అనుభవాన్ని పొందొచ్చు. డిజైన్ సేవలు, డోర్‌స్టెప్ కన్సల్టేషన్‌తో పాటు, వేగవంతమైన డెలివరీ కోసం కొత్త వేర్‌హౌస్‌ను కూడా ప్రారంభించారు.