న్యూక్లియర్ ఫ్యామిలీ స్టోరీ

న్యూక్లియర్ ఫ్యామిలీ స్టోరీ

డాక్టర్ చదివి, డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారిన శౌర్యువ్.. నాని హీరోగా తెరకెక్కించిన చిత్రం ‘హాయ్ నాన్న’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్. మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 7న పాన్ ఇండియా వైడ్‌‌‌‌‌‌‌‌గా విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు శౌర్యువ్ చెప్పిన విశేషాలు. 

........................................
‘‘తండ్రి కూతురు మధ్య అనుబంధం, అలానే మృణాల్ పాత్రతో ఉన్న బాండింగ్‌‌‌‌‌‌‌‌తో కథ వెళుతుంది. మామూలుగా అయితే పిల్లల బాధ్యత మదర్  తీసుకుంటుంది. సింగిల్ పేరెంట్ ఫాదర్ అయితే పిల్లల విషయంలో పూర్తి బాధ్యత ఆయన మీదే ఉంటుంది. పిల్లల చుట్టూ వారి జీవితాన్ని డిజైన్ చేసుకోవాలి. ఇందులో నాని గారి పాత్ర కూడా అలాగే ఉంటుంది. మృణాల్ ఠాకూర్ పాత్రలో చాలా లేయర్స్ ఉంటాయి.  

ఏడ్చే సన్నివేశాలు చాలా ఉన్నాయి. అలా ఏడిస్తే కూడా ఎవరు అందంగా కనిపిస్తారని ఆలోచిస్తున్నప్పుడు నాకు మృణాల్ కనిపించింది. బేబీ కియారా  సూపర్ ట్యాలెంటెడ్. సీన్ గురించి చెప్పి డైలాగు పేపర్ ఇవ్వగానే ఎలాంటి తడబాటు లేకుండా ఎమోషన్‌‌‌‌‌‌‌‌ని అర్ధం చేసుకొని నటించేది. తనతో యాక్ట్ చేయించడానికి నేను పెద్దగా కష్టపడలేదు. శ్రుతి హాసన్ గారు కీలక పాత్రలో  కనిపిస్తారు. హేషమ్ అబ్దుల్ వాహబ్  ఈ చిత్రానికి పాటలతో పాటు చాలా అద్భుతమైన బ్యాక్‌‌‌‌‌‌‌‌గ్రౌండ్ స్కోరు ఇచ్చారు. ఒక్కొక్క పాత్ర, ఎమోషన్‌‌‌‌‌‌‌‌కి తగ్గట్టు మ్యూజిక్ చేశారు. 

ఇది కంప్లీట్ ఫిక్షనల్ స్టోరీ అని చెప్పలేం.. జీవితంలో, సమాజంలో జరిగే కొన్ని రియల్  ఇన్సిడెంట్స్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా దీన్ని రూపొందించా. దర్శకుడిగా నా ప్రధాన బలం ఎమోషన్. అందుకే దీన్ని ఎమోషన్స్ హై పిచ్‌‌‌‌‌‌‌‌లో ఉండే ప్రేమకథగా తెరకెక్కించా. ఇదొక న్యూక్లియర్ ఫ్యామిలీ స్టోరీ. మనుషులు ఎమోషనల్‌‌‌‌‌‌‌‌గా మొద్దుబారుతున్న ఈ సమయంలో ఇలాంటి సినిమాలు రావాలి’’.