ఇలాంటి మంచి కథలు రావాలి : నాని

ఇలాంటి మంచి కథలు  రావాలి : నాని

నాని, మృణాల్ ఠాకూర్ జంటగా శౌర్యువ్ దర్శకత్వంలో మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘హాయ్ నాన్న’. డిసెంబర్ 7న పాన్ ఇండియా వైడ్‌‌గా సినిమా విడుదలవుతోంది. శనివారం సాయంత్రం మ్యూజికల్ ఈవెంట్‌‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ‘దర్శకుడు శౌర్యువ్ ఎన్నో చిత్రాలు తీస్తారు. కానీ ఇది మాత్రం తనకి చాలా స్పెషల్‌‌గా నిలిచిపోతుంది.   మృణాల్‌‌ ఠాకూర్‌‌‌‌ను ఈ సినిమా తర్వాత  యష్ణగా గుర్తుపెట్టుకుంటారు. బేబీ కియరా కూడా చక్కగా నటించింది. హెషమ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు.

టీజర్, ట్రైలర్‌‌‌‌లో చూసిన ఎనర్జీ వేరు .. సినిమాలో కనిపించే ఎనర్జీ వేరు. ఆ ఎనర్జీ అడక్టివ్‌‌గా, ఛార్మింగ్‌‌గా ఉండబోతుంది. ఇలాంటి మంచి కథలు రావాలి. నటులని దర్శకులని మోటివేట్ చేయాలి. అది హాయ్ నాన్న చేస్తుందనే నమ్మకం  ఉంది’ అని చెప్పాడు.  మృణాల్  మాట్లాడుతూ ‘హెషమ్ వండర్ ఫుల్ సాంగ్స్ ఇచ్చారు.  నాని గారు ఆన్ స్క్రీన్ అద్భుతమైన మ్యాజిక్ క్రియేట్ చేశారు. ఇది మార్వలస్ మూవీ.  ‘సీతారామం’ తర్వాత నేను చేసిన చిత్రాల్లో నా మనసుకు బాగా దగ్గరైన చిత్రం ‘హాయ్ నాన్న”అని చెప్పింది. సెన్సార్ నుంచి క్లీన్ యూ సర్టిఫికేట్ అందుకున్న ఈ చిత్రం ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని చెప్పాడు దర్శకుడు శౌర్యువ్. ప్రియదర్శి, విరాజ్ అశ్విన్ పాల్గొన్నారు.