OTTకి వచ్చేసిన హాయ్ నాన్న.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTTకి వచ్చేసిన హాయ్ నాన్న.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న(Hi Nanna). పాన్ ఇండియా లెవల్లో కొత్త దర్శకుడు శౌర్యువ్(Shouryuv) తెరకెక్కించిన ఈ సినిమాలోబాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అవుట్ అండ్ అవుట్ ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిక్సుడ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో సాధించింది ఈ సినిమా.

దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన హాయ్ నాన్న సినిమా లాంగ్ రన్ లో రూ.75 కోట్ల వసూళ్లు రాబట్టి నిర్మాతలకు స్వల్ప లాభాలను తెచ్చిపెట్టింది. ఇక థియేట్రికల్ రన్ ముగించుకున్న ఈ సినిమా ఈరోజు జనవరి 4న ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. నిజానికి ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు కూడా చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నారు. మరి థియేటర్ లో డీసెంట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుతుందో చూడాలి.